ఇంగ్లాండ్ పిచ్ లే విలన్లు.. పాపం దినేష్ కార్తీక్?

praveen
టీమిండియాలో చోటు సంపాదించుకోవడానికి తీవ్రమైన పోటీ ఉంది. ఎంతో మంది యువ ఆటగాళ్లు ఒక్క చాన్స్ అంటూ ఎదురు చూస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో 37ఏళ్ల దినేష్ కార్తీక్ టి20 ఫార్మాట్ లో చోటు దక్కించుకోవడం అసాధ్యం. కానీ  అసాధ్యాన్ని సుసాధ్యం చేసి మళ్లీ జట్టులోకి పునరాగమనం చేశాడు దినేష్ కార్తీక్. ఇటీవల ఐపీఎల్లో ఫినిషర్ రోల్ పోషించడంతో ఇండియాలో  అవకాశం దక్కింది. వచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ మెరుపు ఇన్నింగ్స్ ల తో ఆకట్టుకుంటున్నాడు.  దీంతో అతనికి టి20 ప్రపంచకప్ జట్టులో ఉంటాడు అని అందరూ అనుకున్నారు. కానీ అతని ఆశలు అడియాశలు అయ్యేలా కనిపిస్తున్నాయి.

 అయితే మొదటి నుంచి కూడా అటు ఇంగ్లాండ్ లో ఉండే పిచ్ లు దినేష్ కార్తీక్ అచ్చి రావడం లేదు అన్నది తెలుస్తుంది. ఇటీవల టి20 సిరీస్లో ఇంగ్లండ్ గడ్డపై దినేష్ కార్తీక్ అదరగొడతాడు అని అందరూ అనుకున్నారు.కానీ దినేష్ కార్తీక్ పై అక్కడికి పిచ్ లే పైచేయి సాధించాయ్. టీమ్ ఇండియా తరఫున తన చివరి టెస్ట్ మ్యాచ్ 2018 లో ఆడాడు. ఇంగ్లండ్ గడ్డపైనే. తర్వాత మళ్ళీ టెస్టు మ్యాచ్లో అవకాశం రాలేదు. 2019 ప్రపంచ ఈ సందర్భంగా న్యూజిలాండ్పై ఇంగ్లాండ్ గడ్డపైనే ఆడాడు. మళ్ళీ వన్డే మ్యాచ్లో చోటు దక్కలేదు. దీన్ని బట్టి చూస్తే దినేష్ కార్తీక్ కెరీర్ లో ఇంగ్లాండ్ పిచ్ లే విలన్ గా మారి.. ఎండ్ కార్డు వేసాయాన్నమాట. టి20 సిరీస్ లో కూడా అలాంటి ప్రదర్శన చేసాడు. దీంతో మళ్లీ జట్టులో స్థానం సంపాదించుకుంటాడా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారుతోంది.

 మొన్నటి వరకు బెస్ట్ ఫినిషర్ గా పేరు తెచ్చుకున్న డీకే ఇప్పుడు మాత్రం తన బ్యాటింగ్తో ఉసూరుమనిపిస్తున్నాడు. ఇంగ్లాండ్ పిచ్లపై అతడు టీ20 సిరీస్ లో భాగంగా చేసిన ప్రదర్శన తర్వాత అతనికి టీమిండియాలో స్థానం సందిగ్ధంలో పడిపోయింది అని చెప్పాలి. అటు ఐర్లాండ్ లో  ఆడిన రెండు టి20 మ్యాచ్ లో కూడా పెద్దగా రాణించలేదు. ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టులో కూడా పెద్దగా ప్రభావం చూపలేక పోయాడు. మొత్తం ఐదు మ్యాచ్ లలో కలిపి  34 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అత్యధిక వ్యక్తిగత స్కోరు 12 పరుగులే కావడం గమనార్హం. దీంతో దినేష్ కార్తీక్ ని కొనసాగిస్తారా లేదా అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: