ఎంత అన్యాయం.. బాగా ఆడిన జట్టు నుంచి పక్కకు పెట్టారు?

praveen
ఇటీవలి కాలంలో టీమిండియాలో చోటు దక్కించుకోవడం కోసం పోటీ ఎంత తీవ్రంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐపీఎల్లో సత్తా చాటితే చాలు టీమిండియాలో చోటు అదే వస్తుంది అనుకునేవాళ్ళు. కానీ ఇటీవలి కాలంలో ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శన చేసిన టీమిండియాలో అవకాశం దక్కుతుంది అని గ్యారెంటీ లేకుండా పోయింది. దీంతో ఎంతో మంది ఆటగాళ్లకు నిరాశే ఎదురవుతుంది. అయితే గత రెండేళ్ల నుంచి ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శన చేస్తూ టీమిండియాలో చోటు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు యంగ్ పేసర్ అర్షదీప్ సింగ్.

 సౌత్ ఆఫ్రికా తో జరిగిన టి20 సిరీస్ కి ఎంపికైన బెంచ్ స్ట్రెంత్ కే పరిమితం అయ్యాడు.  ఐర్లాండ్ పర్యటనలో  కూడా ఇదే జరిగింది. ఎట్టకేలకు ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ20లో అవకాశం దక్కించుకున్నాడు  అర్ష దీప్. మొదటి అవకాశం లోనే అదరగొట్టాడు. పవర్ ప్లే లో రెండు ఓవర్లలో కట్టడి చేయడమే కాదు ఒక మెయిడిన్ ఓవర్ కూడా వేసాడు. అంతేకాదు కీలకమైన రెండు వికెట్లు పడగొట్టాడు.  ఈ క్రమంలోనే  తన అరంగేట్రం మ్యాచ్ లోని 3 ఓవర్లలో మేడిన్ ఓవర్ తో పాటు 18 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టి తన ప్రదర్శన తో ఇంప్రెస్ చేశాడు అని చెప్పాలి.

 అలాంటి ఆటగాడు ఇక రెండో టి20లో చోటు దక్కించుకోకపోవడం హాట్ టాపిక్ గా మారిపోయింది. రెండో టీ20లో బూమ్రా కోహ్లీ రిషబ్ పంత్ రవీంద్ర జడేజా జట్టులోకి రావడం తో ఇషాన్ కిషన్, దీపక్ హుడా, అక్షర్ పటేల్, అర్ష దీప్  లను పక్కన పెట్టింది టీమిండియా యాజమాన్యం. అయితే టి20 వరల్డ్ కప్ లో ఆడించాలని కొంతమంది ఆటగాళ్లకు  మాత్రమే వరుస అవకాశాలు ఇస్తుంది టీమిండియా మేనేజ్మెంట్. సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠీ, అర్ష దీప్ సింగ్ లాంటి వాళ్ళు మంచి పర్ఫామెన్స్ చేస్తున్న వారికి పెద్దగా వాడుకోవడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అర్ష దీప్ సింగ్ కి అన్యాయం జరిగింది అంటూ అతని అభిమానులు భావిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: