రెండో టీ20లో రోహిత్ త్రిబుల్ సెంచరీ.. సూపర్ అంటున్న ఫ్యాన్స్?

praveen
ప్రస్తుతం రోహిత్ శర్మ కెప్టెన్గా భారత జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. పూర్తిస్థాయి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోహిత్ సారథ్యంలో ఇప్పటివరకు టీమిండియా ఒక్క పరాజయం కూడా చవిచూడలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇంగ్లండ్ గడ్డపై కూడా అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకుంటూ ఇక ఇటీవల టీ20 సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇకపోతే కెప్టెన్సీలో అదరగొడుతున్న రోహిత్ శర్మ అటు బ్యాటింగ్ లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు అని అర్థమవుతుంది.

 ఎందుకంటే ఇటీవల జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో ఒక అరుదైన రికార్డును సాధించాడు హిట్ మాన్ రోహిత్ శర్మ. రెండో టీ20లో  త్రిబుల్ సెంచరీ సాధించాడు. అదేంటి రోహిత్ శర్మ నిన్నటి మ్యాచ్ లో కనీసం హాఫ్ సెంచరీ కూడా సాధించలేదు.. త్రిబుల్ సెంచరీ ఎప్పుడు సాధించాడు అని కన్ఫ్యూషన్ లో పడి పోతున్నారు కదా.. రోహిత్ శర్మ త్రిబుల్ సెంచరీ సాధించింది ఫోర్లు కొట్టడంలో.. నిన్నటి మ్యాచ్ లో మూడు ఫోర్లు 2 సిక్సర్లు తో మంచి ఇన్నింగ్స్ ఆడాడు రోహిత్ శర్మ. ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ టి20 లలో మూడు వందలు కొట్టిన మొదటి భారతీయుడిగా రికార్డ్ సృష్టించాడు.

 ఐర్లాండ్ బ్యాట్స్మెన్ పాల్ స్టెర్లింగ్ తర్వాత ప్రపంచంలో రెండో బ్యాట్స్మన్గా అరుదైన రికార్డును  ఖాతాలో వేసుకున్నాడు. 127 టి20 మ్యాచ్లలో  ఈ ఘనత సాధించాడు రోహిత్ శర్మ.  కాగా రోహిత్ శర్మ మొత్తంగా  301 ఫోర్లు నమోదు చేశాడు. అంతర్జాతీయ టీ20 లో అత్యధిక పరుగులు 3328 సాధించిన ఆటగాడిగా కూడా రోహిత్ శర్మ నిలిచాడు. కాగా రోహిత్ శర్మ కంటే ముందు ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టెర్లింగ్ అత్యధిక పోర్లు కొట్టిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. టి20 లో ఏకంగా 325 ఫోర్లు కొట్టాడు ఫాల్స్ స్టెర్లింగ్.  ఇలా విజయంతో పాటు రోహిత్ శర్మ అరుదైన రికార్డు సాధించడం పై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: