అదే జరిగితే.. జట్టు నుంచి తప్పుకుంటా : హార్దిక్ పాండ్యా

praveen
సరిగ్గా గత కొన్ని రోజుల నుంచి టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్లీ పూర్వవైభవాన్ని పొందాడు అన్నది తెలుస్తుంది. ఒకప్పుడు ఐదు, 6వ స్థానంలో బ్యాటింగ్కు దిగి సిక్సర్లు  ఫోర్లతో మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ జట్టుకు ఫినిషింగ్ ఇచ్చేవాడు. అదే సమయంలో బౌలింగులో కూడా అదరగొట్టాడు హార్దిక్ పాండ్యా. తర్వాత కాలంలో బౌలింగ్లో పట్టు కోల్పోవడం బ్యాటింగ్లో పేలవ ఫామ్ కనబర్చడంతో అతన్ని బీసీసీఐ పక్కనపెట్టేసింది. అదే సమయంలో అతని గాయాల బెడద వేధించిన నేపథ్యంలో హార్దిక్ పాండ్యా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడు అన్న విషయం తెలిసిందే. ఎన్నో రోజుల పాటు టీమిండియాకు దూరమైన హార్దిక్ పాండ్యా  ఇటీవలే ఐపీఎల్ ద్వారా తాను మునుపటి ఫామ్ లోకి వచ్చాను అని నిరూపించుకున్నాడు.

 అంతేకాదు తనలో సారథ్యం వహించే సామర్థ్యం కూడా ఉంది అని నిరూపించాడు.  గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్ గా మారి జట్టును ముందుండి నడిపించడమే కాదు ఒక ఆటగాడిగా  జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు అని చెప్పాలి. ఇలా ఇటీవలి కాలంలో హార్దిక్ పాండ్యా మెరుగైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకున్నాడు. ఇక టీమిండియా అవకాశం దక్కించుకున్న తర్వాత కూడా  అంతకుమించి  అనే రేంజ్ లోనే ప్రదర్శన చేశాడు. ఐర్లాండ్ పర్యటనలో, సౌత్ ఆఫ్రికా ఇండియా పర్యటనకు వచ్చిన సమయంలో తన ప్రదర్శన తో ఆకట్టుకున్న హార్దిక్ పాండ్యా ఇటీవల ఇంగ్లాండ్లో జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో కూడా  హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.. బౌలింగ్లో కీలకమైన నాలుగు వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు.

 తనకు ఫామ్ పై ఇటీవల హార్దిక్ మధ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన దృష్టంతా వన్డేలు టి20లు ఆడటంపై ఉందని.. టెస్ట్ క్రికెట్ గురించి ఆలోచించడం లేదని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. టీమిండియా కోసం 100% ఎఫెర్ట్ ఇవ్వలేని పరిస్థితి వస్తే జట్టు నుంచి తప్పుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం హార్దిక్ పాండ్యా చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయ్ అని చెప్పాలి. ఇకపోతే నిన్న ఇంగ్లాండ్తో జరిగిన టి20 మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకోవడంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: