ఇంగ్లాండ్ "బీస్ట్" లు మూగబోయిన వేళ.. రోహిత్ సేన విద్వంసం !

VAMSI
రాత్రి జరిగిన మొదటి టీ20 మ్యాచ్ ఇంగ్లాండ్ కు ఒక పీడకలని చెప్పాలి. ఎందుకంటే వరం రోజులకు ముందు కివీస్ ను మూడు టెస్ట్ లలో క్లీన్ స్వీప్ చేసి... ఆ తర్వాత ఇండియాతో ఆఖరి టెస్ట్ లో అద్భుత విజయాన్ని సాధించి సిరీస్ ను సమం చేసి సగర్వంగా ఇండియా పర్యటనను ఆరంభించింది. అయితే ఒక్క మ్యాచ్ తో ఇంగ్లాండ్ మొఖాలు తెల్లబోయాయి. వేల మంది ఇంగ్లాండ్ అభిమానుల ముందు పరువు పోగట్టుకున్నారు. గత రాత్రి మొదట టాస్ గెలిచిన ఇండియా పిచ్ గురించి బాగా స్టడీ చేసిన తర్వాత బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపింది. ఇక ఆరంభం నుండి ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు.
ముఖ్యంగా రోహిత్ శర్మ తన కమ్ బ్యాక్ ను అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. క్రీజులో ఉన్నంతసేపు బౌలర్లను ఉతికారేశాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ మాత్రం ఫెయిల్ అయ్యాడు. దీపక్ హూడా ఎప్పటిలాగే తన స్టైల్ లో ఆడి విలువైన పరుగులు చేశాడు. సూర్య కుమార్ యాదవ కూడా మళ్ళీ మునుపటి ఫామ్ లోకి వచ్చాడు. ఇక ఐర్లాండ్ లో కెప్టెన్ గా వ్యవహరించిన హార్దిక్ పాండ్య అయితే నెమ్మదిగా ఆడుతూ కెరీర్ లో మొదటి అర్ద సెంచరీని సాధించాడు. అలా నిర్ణీత 20 ఓవర్ లలో ఇండియా 198 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ మొదటి నుండి తడబడింది. మ్యాచ్ కు ముందు చెలరేగి ఆడుతారు అనుకున్న వారందరూ ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ లో బీస్ట్ ప్లేయర్స్ అయినా బట్లర్, రాయ్, లివింగ్స్టన్ లు తోకముడిచారు. ఇండియా అద్భుతమైన బౌలింగ్ తో కేవలం 148 పరుగులకే ఆల్ అవుట్ చేసి ఈ సిరీస్ లో లీడ్ లోకి వెళ్ళింది. అన్ని విభాగాలలో ఆధిపత్యం ప్రదర్శించిన రోహిత్ సేన ఘన విజయాన్ని అందుకుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: