హార్దిక్ అంటే ఫ్లవర్ కాదు.. ఫైర్.. ఇరగదీశాడుగా?

praveen
సాధారణంగా ఎంతో మంది ఆటగాళ్లు గాయాల బారిన పడటం ఆ తర్వాత గాయం నుంచి కోలుకునీ రీ ఎంట్రీ ఇవ్వడం చేస్తూనే ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ హార్దిక్ పాండ్యా లాగా మాత్రం ఇప్పటివరకు ఎవరూ సాలిడ్ రీ ఎంట్రీ  ఇవ్వలేదేమో అని అనిపిస్తోంది అతని ప్రదర్శన చూసిన తర్వాత. అద్భుతమైన ప్రదర్శన తో ఆకట్టుకున్న హార్దిక్ పాండ్యా ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాడు. మొన్నటివరకు గాయాల బారినపడి జట్టుకు దూరమైన హార్థిక్ పాండ్య ఇక ఇప్పుడు మాత్రం టీమిండియా లోకి పునరాగమనం తర్వాత   తనకు తిరుగు లేదు అని నిరూపిస్తున్నాడు.

 భారత పర్యటనకు వచ్చిన సౌత్ ఆఫ్రికా పర్యటనలో అదరగొట్టిన హార్దిక్ పాండ్య.. ఐర్లాండ్ పర్యటనలో కూడా కెప్టెన్  గా ఆటగాడిగా అదరగొట్టాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటన లో కూడా అదేరీతిలో ప్రదర్శన చేస్తున్నాడు . ఇక ఇప్పుడు ఇంగ్లండ్ పర్యటనలో కూడా తన ప్రదర్శన తో ఇండియాకు విజయాన్ని అందించాడు . రోహిత్ శర్మ కెప్టెన్సీలో బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా ఒకవైపు బ్యాటింగ్ లో మరోవైపు బౌలింగులో కూడా తనకు తిరుగు లేదు అని నిరూపించాడు. ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ-20 మ్యాచ్లో టీమ్ ఇండియా మూడు పరుగుల తేడాతో విజయం సాధించి శుభారంభం చేసింది అన్న విషయం తెలిసిందే.

 బ్యాటింగ్ లో 51 పరుగులతో రాణించాడు హార్దిక్ పాండ్య. బౌలింగ్ లో కీలకమైన నాలుగు వికెట్లు తీసి అదరగొట్టాడు. ఈ మ్యాచ్లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ముప్పై మూడు బంతుల్లో 51 పరుగులు చేశాడు.  ఇక ఆ తర్వాత ఇండియా బౌలింగ్   సమయంలో కూడా తన బౌలింగ్తో నాలుగు వికెట్లు పడగొట్టి ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అంతేకాదు ఇక టీమిండియాకు విజయం వరించడం లో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అద్భుతమైన ప్రదర్శన చేసిన హార్దిక్ పాండ్యా కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: