వావ్.. 99 వ ఆటగాడిగా అర్షదీప్?

praveen
ఇటీవల కాలంలో టీమిండియాలో స్థానం దక్కించుకోవాలంటే పోటీ ఎంత తీవ్రంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టీమిండియాలో కి ఎంట్రీ ఇస్తున్న యువ ఆటగాళ్ల సంఖ్య కూడా పెరిగిపోయింది అని చెప్పాలి. మొన్నటి వరకు ఐపీఎల్ లో మంచి ప్రదర్శన చేసినప్పటికీ చాలా రోజుల తర్వాత టీమిండియాలో అవకాశం దక్కించుకునే వారు యువ ఆటగాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. మొన్నటికి మొన్న ఐపీఎల్ ముగిసిందో లేదో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్ళు టీమ్ ఇండియా జెర్సీ ధరించే అవకాశాన్ని తగ్గించుకుంటున్నారు.  తక్కువ సమయంలోనే అటు భారత జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే.

 ఇకపోతే ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టి20 సిరీస్ ఆడుతోంది. ఒక మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ లో భారత జట్టు గెలవాలన్న కసితో బరిలోకి దిగుతోంది. కరోనా వైరస్ బారి నుండి కోలుకున్న రోహిత్ శర్మ మళ్లీ టీమిండియా కెప్టెన్సీ చేపట్టాడు అనే చెప్పాలి. అంతే కాదు ఈ టి20 మ్యాచ్ లో ఎంతో మంది యువ ఆటగాళ్లు కూడా అవకాశం దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే మొన్నటి మొన్న ఐపీఎల్ లో అదిరిపోయే ప్రదర్శన చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. హర్షదీప్ సింగ్.  ప్రస్తుతం టీమిండియా లోకి ఆరంగేట్రం చేశాడు అన్నది తెలుస్తుంది.

 మొన్న ఐర్లాండ్ పర్యటనలో అంతకుముందు సౌత్ ఆఫ్రికా భారత పర్యటనకు వచ్చినప్పుడు భారత జట్టు తరఫున ఎంపిక అయినప్పటికీ కేవలం బెంచ్ కు మాత్రమే పరిమితం అయ్యాడు. కానీ ఇటీవల ఇంగ్లాండ్లో జరిగిన టి20లో అవకాశం దక్కించుకొని టి20 లోకి అరంగేట్రం చేశాడు. ఈ క్రమంలోనే భారత్ తరఫున టి20 లో అరంగేట్రం చేసిన 99 ఆటగాడిగా నిలిచాడు. ఇంగ్లాండ్తో  జరుగుతున్న టి20 కి ముందు కెప్టెన్ రోహిత్ శర్మ క్యాప్ అందజేసి కంగ్రాట్స్ తెలియజేశాడు. కాగా ఐపీఎల్ లో మొత్తం 49 టి20 మ్యాచ్ లు ఆడి యాభై రెండు వికెట్లు పడగొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: