ఆడించనప్పుడు.. అతన్ని దేశాలు తిప్పడం ఎందుకు?

praveen
ప్రస్తుతం ఆర్థిక పాండ్యా సారథ్యంలోని టీమ్ ఇండియా జట్టు ఐర్లాండ్ పర్యటన లో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా రెండు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడింది. అయితే ఇక ఈ టి 20 సిరీస్ కు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వహిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. అంతే కాకుండా ఇటీవల ఐపీఎల్లో రాణించిన ఎంతో మంది యువ ఆటగాళ్లకు ఈ టి 20 సిరీస్ లో అవకాశం దక్కింది. కానీ జట్టు లో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకపోవడంతో ఇక ఎంతో మంది ఆటగాళ్లు అటు బెంచ్ కే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇటీవలే మొదటి టెస్టు ఓపెనర్ రుతురాజ్ గాయపడటంతో అతని స్థానంలో దీపక్ హుడా అవకాశం దక్కించుకున్నారు.

 ఇక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 47 పరుగులు చేశాడు అనే విషయం తెలిసిందే  ఇక రెండో మ్యాచ్లో కూడా రుతురాజ్ కూడా అందుబాటులో లేడు. ఇక అతని స్థానంలో ఓపెనింగ్ చేసేందుకు సంజు శాంసన్ ను  జట్టులోకి తీసుకున్నారు కెప్టెన్ హార్దిక్ పాండ్యా. ఇటీవల ఇదే విషయంపై స్పందించిన మాజీ ఆటగాడు కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రుతురాజ్ గైక్వాడ్ జట్టులో ఆడనప్పుడు వెంకటేష్ అయ్యర్ కి అవకాశం ఇస్తారని భావించాను అంటూ చెప్పుకొచ్చాడు. 2021 ఐపీఎల్ సీజన్ లో ఓపెనర్గా వెంకటేష్ అయ్యర్ రాణించాడు అంటూ చెప్పుకొచ్చాడు.

 అయితే వెంకటేష్ అయ్యర్ కి అవకాశం ఇవ్వలేము అనుకున్నప్పుడు అతని ఇలా విదేశీ పర్యటనలకు ఎందుకు తీసుకెళ్తున్నారు.. జట్టులో పెట్టుకుని రిజర్వ్ బెంచ్ లో ఎందుకు కూర్చో పెడుతున్నారు అంటూ ఆకాశ్ చోప్రా  ప్రశ్నించాడు. కేవలం టూరిస్ట్ వీసా మీద అతను ఐర్లాండ్  కి వెళ్ళలేదు కదా.. ఆడించకుండానే అలా తిప్పి చూపించి తీసుకురావడానికి అంటూ ఆకాశ్ చోప్రా ఆగ్రహం వ్యక్తం చేశాడు అని చెప్పాలి. కాగా ఇప్పుడు వరకు వెంకటేష్ అయ్యర్ టీమిండియా తర్వాత 9 టి20 మ్యాచ్లు ఆడాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: