అప్పుడు సిరాజ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు : ఆసీస్ మాజీ కెప్టెన్

praveen
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కొంతమంది ఆటగాళ్లపై మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులు జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తూ ఉండడం సంచలనంగా మారిపోతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. గత ఏడాది ఎంతో రసవత్తరంగా సాగినా బోర్డర్ గవాస్కర్ ట్రోఫి లో కూడా ఇలాంటిదే జరిగింది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫి ఆడింది. ఇక ఈ మ్యాచ్లో భాగంగా అటు మహమ్మద్ సిరాజ్ తండ్రి చనిపోయినప్పటికీ ఆ బాధను దిగమింగుకుని టీమ్ ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించి తండ్రి కోరిక తీర్చాలని ఇక తండ్రి అంత్యక్రియలకు వెళ్లకుండా ఉండిపోయాడు అన్న విషయం తెలిసిందే.

 అప్పటికే పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లో దాచుకున్న మహమ్మద్ సిరాజ్ కు ఇక ఆస్ట్రేలియాలో ఎదురైన చేదు అనుభవాలు అన్నీఇన్నీ కావు. ఏకంగా మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులు జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం సంచలనం గానే మారిపోయింది అని చెప్పాలి. ఇక ఈ విషయం అప్పట్లో పెద్ద చర్చకు కూడా దారితీసింది. అయితే గత ఏడాది బోర్డర్ గవాస్కర్ టోర్నీలో భాగంగా భారత్ ఆసీస్ మధ్య మూడవ టెస్టులో భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ పై ఆస్ట్రేలియా అభిమానులు జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం పై అప్పటి ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ టిమ్ ఫైన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..

 ఆస్ట్రేలియా అభిమానులు వ్యాఖ్యలు తర్వాత మహమ్మద్ సిరాజ్ అంపైర్ దగ్గరికి వెళ్తుంటే అతని కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అప్పటికే తండ్రి చనిపోయిన బాధలో ఉన్న మహమ్మద్ సిరాజ్ పై ఇక ఆస్ట్రేలియా అభిమానులు జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం ఎంతగానో బాధ కలిగించింది అంటూ టిమ్ ఫైన్ చెప్పుకొచ్చాడు. కాగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా 2-1 తేడాతో ఘన విజయాన్ని అందుకుంది టీమిండియా. జట్టులో సీనియర్ దూరమైనప్పటికీ ఇక ఎంతో అద్భుతమైన ప్రదర్శన చేసిన టీమిండియా జట్టు చారిత్రాత్మక విజయాన్ని సాధించింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: