ఐర్లాండ్ పర్యటన.. ఆ ఇద్దరికీ నో ఛాన్స్ అంటున్న ఆకాశ్ చోప్రా?

praveen
ఈ మధ్యకాలంలో టీమిండియా ఎక్కడికైనా పర్యటనకు వెళ్తుంది అంటే మాజీ ఆటగాళ్లు ఎంతో అలర్ట్ గా ఉంటున్నారు. అటు బిసిసిఐ పర్యటనకు వెళ్లే జట్టు వివరాలు ప్రకటిస్తూ ఉంటే.. అటు వెంటనే ఎంతో మంది మాజీ ఆటగాళ్లు తమ ప్లేయింగ్ ఎలెవన్ జట్టును ప్రకటించడం నేటి రోజుల్లో ట్రెండ్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. నేటి రోజుల్లో ఇలాంటి ట్రెండ్ ను మాజీ ఆటగాళ్లు అందరూ కూడా బాగా ఫాలో అవుతున్నారు. మొన్నటి వరకు  సౌతాఫ్రికాతో ఆడబోయే టీమిండియా జట్టును ప్రకటించిన మాజీ ఆటగాళ్లు ఇక ఇప్పుడు ఐర్లాండ్ పర్యటన కోసం బెస్ట్ ఎలవెన్ ఎవరు అన్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

 ఈ క్రమంలోనే ఇటీవల బిసిసీఐ ఐర్లాండ్  పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టు గురించి స్పందించిన మాజీ ఆటగాళ్లు ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐర్లాండ్ పర్యటనకు రిషబ్ పంత్ దూరమయ్యాడు. కాబట్టి నాలుగవ స్థానంలో ఎవరు బ్యాటింగ్కు వస్తారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. రిషబ్ పంత్ స్థానంలో దీపక్ హుడా  అర్హుడు అని నేను భావిస్తున్నాను. ఓపెనర్లుగా ఇశాన్ కిషన్,  రుతురాజ్  ఇద్దరు ఉన్నారు. మూడో స్థానానికి సూర్యకుమార్ యాదవ్ 5వ స్థానానికి హార్దిక్ పాండ్యా కానీ నాల్గవ స్థానానికి దీపక్ హుడా అయితే బాగుంటుంది అంటూ వ్యాఖ్యానించాడు. కాబట్టి అటు ఐర్లాండ్ పర్యటనకు సెలెక్ట్ అయినప్పటికీ రాహుల్ త్రిపాఠి సంజు శాంసన్ లకు ప్లేయింగ్ లెవెల్ లో చోటు దక్కే అవకాశం లేదు అని తెలిపాడు.

 అంతేకాకుండా ఐర్లాండ్ పర్యటనలో కేవలం రెండు టి20 మ్యాచ్  లు మాత్రమే ఆడుతోంది టీమిండియా.  రెండో టీ20 మ్యాచ్ లలో తుది జట్టులో కూడా పెద్దగా మార్పులు ఉండే అవకాశం ఉండదు అంటూ ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు. ఒకవేళ రాహుల్ త్రిపాఠి, సంజు శాంసన్ లలో ఎవరికైనా తుది జట్టులో చోటు దక్కింది అంటే.. దీపక్ హుడా కు దక్కకపోతే అతడు తీవ్రంగా నిరాశ చెందుతాడు.  ఎందుకంటే దక్షిణాఫ్రికాతో సిరీస్కు ఎంపికైన అతను కేవలం మూడు మ్యాచ్ల్లో బెంచికి మాత్రమే పరిమితం అయ్యాడు అంటు సోషల్ మీడియా వేదికగా స్పందించిన మాజీ ఆటగాడు ప్రస్తుత కామెంటేటర్ ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: