సంజు శాంసన్ బానే ఆడతాడు.. కానీ : కపిల్ దేవ్

praveen
ప్రస్తుతం టీమిండియా కెప్టెన్సీ రేసులో  సంజూ శాంసన్ కూడా వచ్చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో సంజూ శాంసన్ ఎంత అద్భుతంగా రాణించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు పేలవ ప్రదర్శన చేసే రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించి ఫైనల్ వరకు తీసుకు వెళ్ళాడు. ఈ క్రమంలోనే కొన్ని ఏళ్ల నిరీక్షణ తర్వాత ఫైనల్ లో అడుగుపెట్టిన రాజస్థాన్ రాయల్స్ జట్టు తప్పకుండా కప్పు కొట్టి తీరుతుందని అందరూ అనుకున్నారు.

 ఫైనల్లో ఓడిపోయి కాస్త నిరాశ పరిచింది అని చెప్పాలి. ఏదేమైనా సంజు శాంసన్ కెప్టెన్సీపై  మాత్రం ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్సీని కూడా ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించగలడు అంటూ ఎంతో మంది ప్రశంసిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ సంజు  ప్రదర్శనపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంజు శాంసన్ ఒకటి రెండు మ్యాచ్ లలో బాగా ఆడతాడు అని.. ఆ తర్వాత అదే ప్రదర్శన కొనసాగించలేక నిలకడలేమితో విఫలం అవుతాడని కపిల్దేవ్ చెప్పుకొచ్చాడు.

 అయితే రానున్న రోజుల్లో టి20 ప్రపంచ కప్ ను దృష్టిలో పెట్టుకుని చూస్తే భారత జట్టులో యువ ఆటగాళ్లకు కొదవలేదు. అంతేకాకుండా టీమిండియాకు నలుగురు వికెట్ కీపర్లు కూడా అందుబాటులో ఉన్నారు. సంజూ, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్,  ఇషాన్ కిషన్ ఇక ఈ నలుగురు కూడా బ్యాటింగ్లో వికెట్ కీపింగ్ లో కూడా నైపుణ్యం కలిగినవారే. తమదైనా రోజు ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగలరు. ఇక ఈ నలుగురు కంటే వృద్ధిమాన్ సాహా మరింత మెరుగైన వికెట్ కీపర్ అని చెప్పాలి. కాని బ్యాటింగ్ లో మాత్రం వృద్ధిమాన్ సాహా కంటే ఈ నలుగురు మరింత మెరుగ్గా ఉన్నారు.

 అయితే సంజూ విషయంలో మాత్రం కాస్త నిరాశ గా ఉన్నాను. అతడిలో ఉన్న ప్రతిభకు కొదవ లేదు. కానీ వరుసగా అవకాశాలు వస్తే అతను కేవలం ఒకటి రెండు మ్యాచుల్లో మాత్రమే రాణించి తర్వాత మాత్రం పేలవా ప్రదర్శన చేస్తూ ఉంటాడు. నిలకడ లేమి కారణంగా విఫలమవుతూ ఉంటాడు. అతడిలో ఉన్న మైనస్ పాయింట్ అదొక్కటే. నిలకడగా ఆడుతున్న వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ అందరికంటే ముందున్నాడు. ఇషాన్ కిషన్ కూడా ఒత్తిడికి లోనవుతున్నట్లు భావిస్తున్నా అంటూ కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: