ఐపీఎల్ 15: ఈ రోజు ఫైనల్ కు వెళ్లే టీమ్ అదేనా ?

VAMSI
ఐపీఎల్ లో లీగ్ మ్యాచ్ లు ముగిశాయి. ఇప్పుడు ప్లే ఆఫ్ దశ జరుగుతోంది. మొత్తం 10 జట్లు పాల్గొన్న ఐపీఎల్ సీజన్ 15 లో చివరికి నాలుగు జట్లు మాత్రం ఎంతో కష్టపడి ఉత్తమమైన ఆటను కనబరిచి ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించారు. వారిలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జాయింట్స్ మరియు రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూర్ లు ఉన్నాయి. ఈ రోజు మొదటి రెండు స్థానాలలో ఉన్న గుజరాత్ మరియు రాజస్థాన్ లు తలపడుతున్నాయి. రెండూ బలమైన జట్లు కావడంతో ఫైనల్ కు అర్హత సాధించే జట్టు ఎవరనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఈ సీజన్ లో హార్దిక్ పాండ్య మరియు సంజు శాంసన్ లు తమ జట్లను ఎంతో సక్సెస్ ఫుల్ గా నడిపిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. మొదట టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఫిల్డింగ్ ఎంచుకుంది. బలమైన గుజరాత్ టీమ్ ముందు మంచి టార్గెట్ ఉంచాలంటే మరోసారి బట్లర్ మరియు శాంసన్ లు చెలరేగాలి. కానీ అధికారిక పిచ్ రిపోర్ట్ ప్రకారం ఈ గ్రౌండ్ లో 180 పరుగులు చేయడం కష్టమని తెలిపారు. అయితే ఇరు జట్ల ప్రదర్శన మరియు రికార్డు చూస్తే రాజస్థాన్ గెలిచే అవకాశాలు ఉన్నాయట.
అయితే రాజస్థాన్ అనుకున్నంతగా రాణించలేదు అని చెప్పాలి. మొదటి నుండి వీరోచిత బ్యాట్సమన్ బట్లర్ తన జోరు చూపించడంలో విఫలం అయ్యాడు. ఇక అతనికి బదులుగా సంజు శాంసన్ కాసేపు బ్యాట్ ను జులిపించాడు. అలా చివరికి నిర్ణీత 20 ఓవర్ లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసి ఛాలెంజ్ స్కోర్ ను గుజరాత్ ముందు ఉంచింది. మరో సారి బట్లర్ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు మంచి స్కోర్ ను అందించాడు. అయితే రాజస్థాన్ కు పటిష్టమైన బౌలింగ్ ఎటాక్ ఉండడంతో ఈ స్కోర్ ను ఛేదించడం ఏమంత ఈజీ కాదు. అయితే గుజరాత్ గెలిచినా మ్యాచ్ లు అన్నీ కూడా టైట్ ఫినిష్ లే కావడం గమనార్హం. మరి ఈ స్కోర్ ను గుజరాత్ ఛేదిస్తుందా లేదా అన్నది తెలియాలంటే కాస్త సేపు ఆగాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: