ఆ ఇద్దరిని ఎందుకు సెలెక్ట్ చేయలేదు.. బీసీసీఐని ప్రశ్నిస్తున్న ఫ్యాన్స్?

praveen
సాధారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో బాగా రాణించిన ఆటగాళ్ళను  టీమిండియా లోకి తీసుకోవడం ఎప్పటినుంచో జరుగుతోంది. ఈ ఐపీఎల్ సీజన్ లో అద్భుతంగా రాణించిన వారిని ఆ తర్వాత జరిగే సిరిస్ కు సెలెక్టర్లు పరిగణలోకి తీసుకుంటుంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా మెరుగైన ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లను దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్ ల సిరీస్ కోసం ఎంపిక చేసింది. 18 మంది ఆటగాళ్లతో కూడిన జాబితాను విడుదల చేసింది.

 ఇక ఇందులో ఈ సీజన్లో అంతగా ఆకట్టుకోని పేలవమైన కనబరిచినా రుతురాజ్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ లాంటి ఆటగాళ్లను ఎంపిక చేయగా  ఎంతో మెరుగైన రన్రేట్ కలిగిన సంజూ శాంసన్, రాహుల్  త్రిపాఠీలను మాత్రం అటు సెలెక్టర్ పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం.  ఇదే విషయం ప్రస్తుతం అందరిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది అని చెప్పాలి. దీంతో ఇక సోషల్ మీడియా వేదికగా బిసిసిఐని  ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఈ లెక్కన రాహుల్ త్రిపాటీతోపాటు సంజూ శాంసన్ లను ఏ లెక్కన సెలెక్ట్ చేయలేదు అంటూ నిలదీస్తున్నారు.

 ఏకంగా ఐపీఎల్ లో భాగంగా రాహుల్  14 మ్యాచుల్లో కలిపి 413 పరుగులు చేశాడు. 3 అర్థ శతకాలు కూడా ఉండటం గమనార్హం. అంతేకాదు స్ట్రైట్ రేట్ 158. 23 ఉంది. సంజు శాంసన్ 14 మ్యాచ్ లలో 374 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉండడం గమనార్హం. స్ట్రైక్ రేట్ 147. 24  ఉంది. ఇక ఐపీఎల్లో ఇంత మంచి ప్రదర్శన చేసి ఇంత మంచి గణాంకాలు ఉన్న ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడంపై అభిమానులు మాత్రం మండి పడుతున్నారు అని చెప్పాలి. అంతే కాదు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో  కొనసాగుతున్న శిఖర్ ధావన్ ను కూడా ఎంపిక చేయడంపై పెదవి విరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: