''చావో రేవో'' మ్యాచ్ బెంగుళూరు హీరో అయ్యేది ఎవరు ?

VAMSI
ఈ రోజు ఐపీఎల్ లో జరుగుతున్న కీలక మ్యాచ్ ఇది. బెంగుళూరు రాయల్స్ ఛాలెంజెర్స్ మరియు గుజరాత్ టైటాన్స్ మధ్యన జరుగుతోంది. ఈ మ్యాచ్ బెంగుళూరు కు చాలా ఇంపార్టెంట్ అని తెలిసిందే. ఇదే వారికి లీగ్ లో ఆఖరి మ్యాచ్ కావడం గమనార్హం. టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ఎప్పటిలాగే బ్యాటింగ్ తీసుకున్నాడు. టోర్నీ మొదట్లో అన్ని పిచ్ లు ఛేజింగ్ కి అనుకూలంగా ఉండేవి, కానీ మ్యాథ్ లు జరుగుతున్న కొద్దీ పిచ్ లు మొదటి బ్యాటింగ్ కు అనుకూలంగా ఛేజింగ్ కు కష్టంగా మారుతూ వచ్చాయి అందుకే గుజరాత్ మొదట బ్యాటింగ్ తీసుకుంది. అయితే నిర్ణీత ఓవర్ లలో గుజరాత్ 168 పరుగులు చేసింది.
ఒకదశలో 150 స్కోర్ అయినా చేస్తుందా అనిపించింది.. కానీ కెప్టెన్ ఒకడే చివరి వరకు నిలిచి ఈ స్కోర్ ను తన టీమ్ కు అందించాడు. హార్దిక్ పాండ్య ఒక్కడే 47 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు మరియు 3 సిక్సర్లు ఉన్నాయి. ఇక అతనికి మిల్లర్ మరియు రషీద్ ఖాన్ లు చక్కని సహకారం అందించారు. ఇక ఫామ్ లో ఉన్న సహా పవర్ ప్లే లో జట్టుకు విలువైన పరుగులు అందించాడు. ఇప్పుడు బెంగుళూరు ౧౬౯ పరుగుల టార్గెట్ ను ఛేదిస్తుందా అన్నది ప్రశ్నగా మిగిలింది.
అయితే ఈ మ్యాచ్ లో బెంగుళూరు గెలిస్తే 16 పాయింట్లు సాధిస్తుంది. ఒకవేళ కొంచెం వేగంగా అంటే... 15 ఓవర్లకు చేధిస్తే కొంచెం రన్ రేట్ కూడా మెరుగుపడుతుంది. అదే సమయంలో ఢిల్లీ తన తరువాత మ్యాచ్ లో  ఓడిపోతే అప్పుడు బెంగుళూరు కు ప్లే ఆఫ్ చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇది జరుగుతుందా అన్నది ఒక ప్రశ్న. కాబట్టి ఆరంభం నుండే బెంగుళూరు వేగంగా ఆడితే ఉపయోగం ఉంటుంది. మరి ఏమి జరుగుతుందో చూద్దాం. చావో రేవో మ్యాచ్ లో బెంగుళూరు జట్టును గెలిపించి ఎవ్వరు ఈ రోజు హీరో అవుతారో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: