జట్టులో చోటు ఇస్తామంటే.. వద్దంటున్న సాహ?

praveen
టీమిండియాలో వెటరన్ వికెట్ కీపర్ గా కొనసాగుతున్న వృద్ధిమాన్ సాహా గత కొంత కాలం నుంచి టీమిండియాకు దూరం అవుతూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. పేలవా ప్రదర్శన కారణంగా జట్టు సెలెక్షన్ లో అతన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు టీమిండియా సెలెక్టర్లు. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో అతని రిటైర్మెంట్ పక్క అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఇటీవలి కాలంలో ఈ సీనియర్ వికెట్ కీపర్గా వివాదాల పాలు అవుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల వృద్ధిమాన్ సాహా మరో షాకింగ్ నిర్ణయం తీసుకుని బాంబు పేల్చాడు.

 దేశవాళీ క్రికెట్లో తన జట్టు బెంగాల్ ను వీడేందుకు సిద్ధమవుతున్నట్లు వృద్ధిమాన్ సాహా చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే దీనికోసం నిరభ్యంతర పత్రం కావాలి అంటూ బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అభిషేక్ దాల్మియా తో  మాట్లాడినట్లు తెలుస్తోంది. వచ్చే నెల ఆరవ తేదీన ఝార్ఖండ్ తో క్వార్టర్స్ లో బెంగాల్ జట్టు తలపడనుంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ కోసం సాహను ఎంపికచేశారు. కానీ జట్టును ప్రకటించే ముందు మాత్రం వృద్ధిమాన్ సాహానీ సంప్రదించలేదు. ఈ క్రమంలో తనను జట్టులో సెలెక్ట్ చేసారు అని తెలియగానే కోపంతో బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అభిషేక్ దాల్మియా కు ఫోన్ చేసి బెంగాల్ను వీడేందుకు నిరభ్యంతర పత్రం ఇవ్వాలని అంటూ అడిగాడని ప్రస్తుతం సమాచారం అందుతోంది.

 గత కొంత కాలం నుంచి క్యాబ్ సంయుక్త కార్యదర్శి దేబాభ్రత దాస్ తో వృద్ధిమాన్ సాహా కు విభేదాలు ఉన్నాయని అందుకే ఇకపై బెంగాల్ జట్టుతో ఆడేందుకు వృద్ధిమాన్ సాహా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. తన నిబద్ధతను ప్రశ్నించిన అతని నుంచి సహా బహిరంగ క్షమాపణ కోరుకున్నాడని తెలుస్తుంది. గతంలో కూడా వ్యక్తిగత కారణాల వల్ల రంజి లీగ్ దశనుంచి వృద్ధిమాన్ సాహా పక్కకు తప్పుకున్నాడు. ఇక ఆ సమయంలోనే బెంగాల్ జట్టు ఆడే విషయంపై దేబాభ్రత దాస్ సాహను ప్రశ్నించాడన్నా ఆరోపణలు కూడా ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: