వావ్.. తొలి బంతికే వికెట్ తీసిన జూ. మలింగా?

praveen
ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రస్థానాన్ని కొనసాగించిన విషయం తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో నాలుగుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన చాంపియన్ జట్టుగా కొనసాగుతోన్న చెన్నై సూపర్ కింగ్స్ కి ఇక ఈ ఏడాది ఐపీఎల్ లో మాత్రం గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. అంతేకాదు ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ లో జరిగిన మార్పులు కూడా అందరినీ అవాక్కయ్యేలా చేశాయ్ అని చెప్పాలి. ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో జడేజా సారథ్య బాధ్యతలు చేపట్టడంతో చెన్నై సూపర్ కింగ్స్ వరుస పరాజయాల పాలు కావడం జరిగింది. ఇక ఆ తర్వాత జడేజా కెప్టెన్సి ధోనీకి అప్పగించాడు.

 ధోనీ కెప్టెన్సీ చేపట్టిన తర్వాత కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో ఎలాంటి మార్పు రాలేదు అనే చెప్పాలి. ఇకపోతే ఇటీవలే ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఘోర పరాభవాన్ని చవిచూసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. చివరికి ప్లే ఆఫ్ చేరకుండానే ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ ఆడే ప్రతి మ్యాచ్ కూడా కేవలం నామమాత్రం మాత్రమే కావడం గమనార్హం. ఇలాంటి సమయంలోనే మొన్నటి వరకు కేవలం బెంచ్ కు మాత్రమే పరిమితం చేసిన యువ ఆటగాళ్లకు చెన్నై జట్టు యాజమాన్యం అవకాశం ఇచ్చింది అని తెలుస్తోంది.

 ఈ క్రమంలోనే జూనియర్ మలింగా గా పేరు సంపాదించుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఫేసర్ మతీష పత్తిరాస ఐపీఎల్ లో తన తొలి బంతికే వికెట్లు తీయడం హాట్ టాపిక్ గా మారిపోయింది.  శ్రీలంకకు చెందిన మతీష పత్తిరాస శ్రీలంక దిగ్గజం అయిన లసిత్ మలింగ లాగే బౌలింగ్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. అతనిలాగే  బౌలింగ్ యాక్షన్ ఉండడంతో అభిమానులు అందరూ కూడా ఎంతగానో మురిసిపోతున్నారు అనే చెప్పాలి. వచ్చి రావడంతోనే అద్భుతమైన యార్కర్ వేసి గుజరాత్ బ్యాట్స్మెన్ను ఎల్బిడబ్ల్యు రూపంలో పెవిలియన్ పంపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: