అంపైర్ మహానుభావుడు.. ఔట్ ను వైడ్ ఇచ్చాడు?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ప్రతి జట్టు కూడా ఎంతో అద్భుతంగా ఆడుతోంది. కానీ అంపైర్ల నిర్ణయాలు మాత్రం మ్యాచ్ ఫలితాల పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయ్ అని చెప్పాలి. అంపైర్లు చేస్తున్న చిన్నపాటి పొరపాట్లు మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తూ ఉన్నాయి. దీంతో ఇటీవల కాలంలో అంపైర్లు ఇస్తున్న తప్పుడు నిర్ణయాలు అటు అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాయి. సోషల్ మీడియాలో ఎంతోమంది ట్రోల్ చేయడం కూడా మొదలు పెడుతున్నారు అన్న విషయం తెలిసిందే.

 దాదాపు ప్రతీ మ్యాచ్లో కూడా ఇలా అంపైరింగ్ తప్పిదాల కి సంబంధించిన ఘటన జరుగుతూనే ఉంది.  మైదానంలో ఉన్న ఆటగాళ్లు మాత్రమే కాదు మాజీ క్రికెటర్లు క్రికెట్ ప్రేక్షకులు సైతం అంపైర్ల  తప్పుడు నిర్ణయాల పై పెదవి విరుస్తున్నారు. అయితే ఇటీవలే కోల్కతా నైట్రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ విషయంలో కూడా అంపైర్ ఇచ్చిన ఒక తప్పుడు నిర్ణయం రాజస్థాన్ రాయల్స్ జట్టు కి శాపంగా మారి పోయింది. రాజస్థాన్ నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగింది కోల్కతా నైట్రైడర్స్ జట్టు.

 కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 32 బంతుల్లో 34 పరుగులు చేసి నిలకడగా బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. అయితే శ్రేయస్ అయ్యర్ అవుట్ విషయంలో ఆన్ ఫీల్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన 13 ఓవర్లో 5వ బంతి శ్రేయస్ అయ్యర్ ఫుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా బంతి శ్రేయస్ అయ్యర్ గ్లౌస్  తాకి అన్నదాత కీపర్ చేతిలో పడింది. శ్రేయస్ అయ్యర్ అవుటయ్యాడు అన్న ఆనందంలో సంజూ శాంసన్ సంబరాలు చేసుకున్నాడూ. కానీ అంపైర్ మాత్రం ఆ బంతిని వైడ్ గా ప్రకటించడం గమనార్హం. అంపైర్ నిర్ణయంతో షాక్ అయిన సంజు శాంసన్ వెంటనే డిఆర్ఎస్ కు వెళ్ళాడు. రిప్లైలో బంతి గ్లౌజ్ తాకినట్టుగా కనిపించింది  దాంతో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది  అయితే ఫీల్డ్ అంపైర్ పై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. అంపైర్  నిజంగా మహానుభావుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: