సంజూ శాంసన్ అది తగ్గించుకుంటే బెటర్ : వసీం జాఫర్

praveen
ఇటీవలే ఐపీఎల్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో భాగంగా భాగంగా ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఇక మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు బ్యాటింగ్ లో కాస్త తడబాటుకు గురైంది అని చెప్పాలి. దీంతో సెంచరీల వీరుడు జోస్ బట్లర్ సైతం తక్కువ పరుగులకే వికెట్ చేజార్చుకున్నాడు.  ఇక ఆ తర్వాత కెప్టెన్  సంజు శాంసన్  నిలకడగా రాణిస్తున్నట్లు కనిపించినప్పటికీ ఆ తర్వాత రిస్కీ షాట్స్ ఆడి వికెట్లు చేజార్చుకున్నాడూ అనే చెప్పాలి.

 ఇక ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లు ఎవరూ కూడా పెద్దగా రాణించలేకపోయారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు అతికష్టంమీద 154 పరుగులు చేయగలిగింది. ఈ క్రమంలోనే సాదాసీదా లక్ష్యఛేదనలో తోనే కోల్కతా నైట్రైడర్స్ జట్టు బరిలోకి దిగింది. కానీ రాజస్థాన్ లాంటి బలమైన బౌలింగ్ విభాగం ముందు కోల్కతా బ్యాటర్ లు నిలువగలరా లేదా అని అనుమానం కలిగింది. అనుకున్నట్లుగానే వరుసగా వికెట్లు కూడా పడ్డాయి. కానీ ఆ తర్వాత మాత్రం అనూహ్యంగా పుంజుకుని కోల్కతా బ్యాటింగ్ విభాగం కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఏడు వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై విజయం సాధించారు.

 ఇకపోతే ఈ మ్యాచ్ విషయంపై స్పందించిన మాజీ ఆటగాడు వసీం జాఫర్ రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ ఆటతీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఫామ్ కాపాడుకోవాలంటే రిస్కీ షాట్స్ తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మూడవ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న సంజూ శాంసన్ నిలకడగా ఆడాలని సూచించాడు. 5 లేదా 6 వ స్థానంలో వచ్చినప్పుడు  రిస్కీ షాట్ లు ఆడిన పెద్దగా సమస్య ఉండదని కానీ మూడవ స్థానంలో వచ్చినప్పుడు మాత్రం ఆచితూచి ఆడుతూ పరుగులు చేయాల్సిన అవసరం ఉంటుందని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: