సంజు శాంసన్ టీమిండియాకు దూరం కావడానికి కారణం అదే?

praveen
సంజు శాంసన్.. మంచి ప్రతిభ ఉన్న ఆటగాడు. ఒక్కసారి క్రీజ్ లో కుదురుకున్నాడంటే చాలు భారీ సిక్సర్లు కొట్టగల సత్తా అతని సొంతం. ఎంతో అలవోకగా జట్టుకు విజయాన్ని అందించడంలో సంజు శాంసన్ ఎప్పుడూ ముందుంటాడూ అని చెప్పాలి   అయితే ఇక సంజు శాంసన్ లాంటి ఒక ప్రతిభగల ఆటగాడు అటు భారత జట్టులో మాత్రం అంతంతమాత్రంగానే చోటు దక్కించుకున్నాడు అని చెప్పాలి. దీనికి కారణం కూడా లేకపోలేదు. సంజు శాంసన్ 2, 3 మ్యాచ్ లలో అద్భుతంగా ఆడుతాడు భారీగా పరుగులు చేస్తాడు. అందరి చూపులు తన వైపుకు తిప్పుకున్నాడు. కానీ ఆ తర్వాత మాత్రం అతని ఆటతీరు ఘోరమైన ఫామ్ లేని ఆటగాడి తీరును తలపిస్తూ ఉంటుంది.

 మొదట్లో వరుసగా భారీ పరుగులు చేసి ఆకట్టుకున్న సంజూ శాంసన్  ఇక ఆ తర్వాత మాత్రం ఒక సాదాసీదా పరుగులు చేయడానికి కూడా తెగ ఇబ్బందులు పడుతూ ఉంటాడు అని చెప్పాలి  ఈ క్రమంలోనే ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్  మంచి ఫామ్ లో కొనసాగుతున్నప్పటికీ  దాన్ని కొనసాగించడంలో మాత్రం పూర్తిగా విఫలమవుతున్నాడూ అన్నది ప్రస్తుతం ప్రేక్షకులు ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్న మాట. కేవలం రాజస్థాన్ రాయల్స్ జట్టులో మాత్రమే కాదు అటు టీమిండియాలో కూడా ఇదే ఆటతీరును కొనసాగిస్తూ సరైన అవకాశం అందుకోలేక పోతున్నాడు సంజు శాంసన్.

 ఇటీవల ఇదే విషయంపై వెస్టీండీస్ మాజీ క్రికెటర్ ఇయాన్ బిషబ్  స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడూ. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్  ఫామ్ లో ఉన్నాడని కానీ ఎక్కువ కాలం పాటు దాని కొనసాగించడంలో విఫలం అవుతున్నారు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. క్రిక్ ఇన్ఫో తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నిలకడలేని వల్ల జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేకపోతూ ఉన్నాడని చెప్పుకొచ్చాడు  అయితే ప్రస్తుతం టీమిండియాలో పోటీ తీవ్రమైంది. మరీ ముఖ్యంగా సంజు శాంసన్ కి పంత్ లాంటి ఆటగాళ్లతో ఒక అసలు సిసలైన పోటీ ఉంది. ఈ క్రమంలోనే టీమిండియాలో చోటు దక్కించుకోవాలంటే ఒకవైపు బ్యాటింగ్లో మరోవైపు అటు కీపింగ్ లో కూడా సంజూ శాంసన్ మరింత రాటు తేలాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు విండీస్ మాజీ క్రికెటర్ ఇయాన్ బిషప్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: