ఐపీఎల్ : బలవంతంగా సంతకం తీసుకొని.. జట్టు నుండి పంపేశారు?

praveen
ప్రస్తుతం ఐపీఎల్ పోరు ఎంతో రసవత్తరంగా మారిపోయింది. ప్రతీ మ్యాచ్ కూడా చివరి బంతి వరకు సాగుతూ ఉండడంతో ప్రేక్షకులకు అసలు సిసలైన క్రికెట్ మజా అందుతుంది. అయితే ఐపీఎల్ లో ఛాంపియన్ జట్లుగా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ మొదటి విజయాన్ని సాధించేందుకు నానా తంటాలు పడుతుంటే.. ఐపీఎల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో గుజరాత్ జట్లు మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతూ ఉండడం గమనార్హం. కేటీఆర్ జట్టు కూడా దుమ్మురేపుతోంది. కాగా ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ లో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు రాబిన్ ఊతప్ప.

 ఇకపోతే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు ఈ సీనియర్ ప్లేయర్. 2008 ఐపీఎల్ సీజన్ నుండి క్రమం తప్పకుండా అన్ని సీజన్లలో ఆడుతున్న ప్లేయర్ లలో రాబిన్ ఉతప్ప కూడా ఒకడు. అయితే కెరీర్ ఆరంభంలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు ఈ సీనియర్ ప్లేయర్. ఆ తర్వాత బెంగళూరు, పూణే, కోల్కత్తా, రాజస్థాన్ తరపున ఆడి ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ లో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 196 మ్యాచ్లు ఆడిన రాబిన్ ఉతప్ప 4813 పరుగులు చేసి టాప్ రన్స్ చేసిన ప్లేయర్ లిస్టు లో ఉన్నాడు.

 మొదటి సీజన్లో ముంబై ఇండియన్స్ లో ఆడి తర్వాత సీజన్లో బెంగుళూరు లోకి వెళ్ళిపోయాడు. ఇక ఇలా ఒక జట్టు నుంచి మరో జట్టుకు ట్రాన్స్ఫర్ అవ్వడం పై ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. ఐపీఎల్ టీం ట్రాన్స్ఫర్ అయిన మొదటి ప్లేయర్ లో నేను ఒకడిని. జహీర్ ఖాన్ మనిష్ పాండే ముంబై ఇండియన్స్ లో ఉన్నారు. సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడాలని కట్టుబడి పోయాను కానీ ఐపీఎల్ ముగిసిన తర్వాత టీం మారాలని చెప్పారు. ఇక ట్రాన్స్ఫర్ పేపర్ పై సంతకం చేసేందుకు ఒప్పుకోక  పోయినప్పటికీ ముంబై ఇండియన్స్ లోని ఒక వ్యక్తి మాత్రం సంతకం చేయకపోతే టీం లోటు ఉండదని భయపెట్టి బలవంతంగా సంతకాలు చేయించి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ సమయంలో డిప్రెషన్లో ఉన్న నేను బెంగళూరు తరఫున ఒక మ్యాచ్లో కూడా సరిగా లేక పోయాను అంటూ షాకింగ్ విషయం బయటపెట్టాడు రాబిన్ ఉతప్ప..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: