సంజు శాంసన్ పై.. రాజస్థాన్ హెడ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు?

praveen
బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్న వేళ అన్ని జట్లు సమాయత్తమవుతున్నాయి. ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కుంటూ ప్రతి మ్యాచ్లో విజయం సాధిస్తూ ఇక టైటిల్ పోరులో ముందు ఉండాలని అనుకుంటున్నాయ్. ఈ సారి టైటిల్ గెలవడమే లక్ష్యంగా అన్ని జట్లు కూడా ప్రత్యర్థి వ్యూహాలకు ప్రతి వ్యూహాలు సిద్ధం చేసుకుంటూ ఉండడం గమనార్హం. అయితే ఇప్పుడు వరకు కొన్ని జట్లు వరుసగా టైటిల్స్ కొట్టిన జట్లుగా కొనసాగుతూ ఉంటే మరికొన్ని జట్లకు మాత్రం టైటిల్ అందని ద్రాక్షలా గా మారిపోయింది. ముఖ్యంగా తొలి సీజన్లో కప్పు కొట్టి సత్తాచాటిన రాజస్థాన్ రాయల్స్కు ఆ తర్వాత టైటిల్ కొట్టే ఛాన్స్ ఎక్కడ రాలేదు.

 ఇక ఈ సారి ఎలాగైనా టైటిల్ విజేతగా నిలవాలని పట్టుదలగా ఉంది ఆ జట్టు. అయితే ఇటీవలే మెగా వేలం  కారణంగా జట్టులోకి ఎంతో మంది స్టార్ ప్లేయర్స్ కూడా రావడంతో ఇక జట్టు పటిష్టంగా కనిపిస్తూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే ఇక శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగక్కార ఇక రాజస్థాన్ రాయల్స్ కి హెడ్ కోచ్ గా ఎంపికయ్యాడు. ఇకపోతే ఇటీవలె రాజస్థాన్ రాయల్స్ జట్టు గురించి మాట్లాడిన కుమార్ సంగక్కార జట్టు కెప్టెన్ సంజు శాంసన్ పై వర్షం కురిపించాడు.  అత్యుత్తమ టి20 ఆటగాళ్లలో సంజు శాంసన్ కూడా ఒకడు అంటూ కితాబు ఇచ్చాడు. 2013లో సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వచ్చాడు.

 ఇక గత ఏడాది సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ పగ్గాలు కూడా అందుకున్నాడు. ఇప్పుడు వరుసగా రెండోసారి ఈ సీజన్లో కూడా జట్టును సారధిగా ముందుకు నడిపించ పోతున్నాడు. సంజు సాంసంగ్ లో బ్యాటింగ్ నైపుణ్యమే కాకుండా నాయకత్వ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి అంటూ కుమార సంగక్కర ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్ సంగతిని పక్కనబెడితే అతడు అత్యుత్తమ టి20 ఆటగాడు అంటూ రాజస్థాన్ హెడ్ కోచ్ కుమార సంగక్కర కితాబిచ్చాడు. ఇక పోతే ఇక ఈసారి సరికొత్త ఆటగాళ్ళతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎలా రాణించబోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: