కళావతి పాటపై.. సన్రైజర్స్ ఆటగాడు డాన్స్?

praveen
మొన్నటివరకు క్రికెటర్లు అంటే కేవలం క్రికెట్ ఆట తో మాత్రమే ప్రేక్షకులను ఆకర్షించేవారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం  క్రికెటర్లు కూడా సినీ సెలబ్రిటీల గా మారిపోతున్నారు. బాగా పాపులారిటీ సాధించిన పాటల పై అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ లు చేయడం ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చేస్తున్నారు ఎంతో మంది క్రికెటర్లు. గతంలో డేవిడ్ వార్నర్ లాక్డౌన్ సమయం ఇక ఎంతో మంది ఇండియన్ హీరోల సినిమాల్లోని పాటలపై టిక్ టాక్ చేసి బాగా ఫేమస్ అయిపోయాడు. ఇక మొన్నటికి మొన్న పుష్ప మేనియా ఎంతలా నడిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాట పై ఎంతో మంది క్రికెటర్లు తమదైన శైలిలో డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో భారత్లో మాత్రమే కాదు విదేశీ క్రికెటర్లు సైతం ఇక ఇలాంటి డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం  సోషల్ మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది  గత కొంత కాలం నుంచి మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా నుంచి కళావతి పాట సోషల్ మీడియా లో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఎంతోమంది సెలబ్రిటీలు ఈ పాటపై డాన్స్ చేసి ఆకట్టుకున్నారు.

 ఇప్పుడు మేమేం తక్కువ కాదు అది ఎంతో మంది క్రికెటర్లు ఈ పాటపై స్టెప్పులేస్తూ సందడి చేస్తున్నారు అన్ని చెప్పాలి. కాగా మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే జట్టు క్యాంపుకు చేరుకున్నారు అందరూ  ఎంతో సరదా సరదాగా గడుపుతు ఆ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారూ. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో సన్రైజర్స్ లోకి తీసుకోబడిన యువ ఆటగాళడు  అభిషేక్ శర్మ కళావతి పాటపై డాన్స్ చేసిన ఈ వీడియో సన్రైజర్స్ యాజమాన్య అధికారిక సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఇది  కాస్త వైరల్ గా మారిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: