సెకండ్ వన్ డే: టాస్ గెలిచిన రాహుల్... మ్యాచ్ గెలిపిస్తాడా?

VAMSI
సౌత్ ఆఫ్రికా పర్యటనలో భారత్ పోరాటం కొనసాగుతోంది. మూడు టెస్ట్ లు మరియు మూడు వన్ డే ల సీరీస్ కోసం భారత్ ఇక్కడకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే టెస్ట్ సీరీస్ ను ఇప్పటికే కోల్పోయి భారత్ ప్రేక్షకులను తీవ్ర నిరాశలో మిగిల్చారు. అయితే ఇప్పుడు జరుగుతున్న వన్ డే సీరీస్ లోనూ మొదట మ్యాచ్ లో కీలక సమయంలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లు చేతులు ఎత్తేయడంతో 31 పరుగుల ఓటమిని మూటగట్టుకుంది. ఇక ఈ సీరీస్ లో మిగిలిన రెండు వన్ డే లను గెలుచుకుని కాస్త అయినా పరువు దక్కించుకోవాలని బరి లోకి దిగుతున్నారు. అయితే గత మ్యాచ్ లో విఫలం అయిన శ్రేయాస్ లేదా వెంకటేష్ అయ్యర్ లలో ఒకరిపై వేటు పడుతుంది అంతా భావించారు.
కానీ కొత్త కోచ్ రాహుల్ ద్రావిడ్ మరో సారి వారిద్దరిపై విశ్వాసం ఉంచి గత మ్యాచ్ లో ఆడిన టీమ్ నే కొనసాగించాడు. ఇప్పుడు రాహుల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. మ్యాచ్ జరిగే కొద్దీ పిచ్ స్లో అవుతుందని భావించిన రాహుల్ ముందుగా బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపాడు. అయితే టాస్ అయితే గెలిచాడు కానీ, మ్యాచ్ విషయంలో ఏమవుతుంది అనేది తెలియాల్సి ఉంది. రాహుల్ ఒక సారథిగా జట్టును ముందుండి విజయం దిశగా నడిపించాలి. రాహుల్ ఒక సారధిగా తనదైన మార్క్ ను చూపించి అందరి దగ్గర నుండి సరైన ప్రదర్శన రాబట్టు కోవాలి.
గత మ్యాచ్ లో దారుణంగా ఫెయిల్ అయిన రాహుల్ ఈ మ్యాచ్ లో అయినా తన మార్క్ చూపించి ఇండియా విజయానికి కారణం అవుతాడా? అలాగే ఇక కెప్టెన్ గా వచ్చిన అవకాశాన్ని పూర్తిగా వాడుకుంటున్నాడా? అన్న ప్రశ్నలకు  సమాధానం తెలియాలంటే ఇంకాస్త సమయం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: