భారత్ తొలి మ్యాచ్ నేడు.. సర్వత్రా ఉత్కంఠ?

praveen
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న ఆటలలో అటు క్రికెట్ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నో దేశాలలో క్రికెట్ మ్యాచ్ లను పిచ్చిగా వీక్షించే ప్రేక్షకులు ఎంతో మంది ఉన్నారు. ఇక భారత్ లో అయితే ఏ ఆట కి లేనంత క్రేజ్ కేవలం క్రికెట్ కి మాత్రమే ఉంది అని చెప్పాలి. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు టీవీలకు అతుక్కుపోయి మ్యాచ్ వీక్షిస్తూ ఉంటారు. సాధారణంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరుగుతుంది అంటేనే టీవీలకు అతుక్కుపోతుంటారు ప్రేక్షకులు. అలాంటిది ఇక వరల్డ్ కప్ జరుగుతుంది అంటే ఎంత ఉత్కంఠభరితంగా మ్యాచ్ వీక్షిస్తూ ఉంటారు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 అయితే గత ఏడాదిలో టి20 మెన్స్ వరల్డ్ కప్ చూసి ఎంతగానో ఎంటర్టైన్మెంట్ పొందారు క్రికెట్ ప్రేక్షకుల.  ఇక ఇప్పుడు మరో వరల్డ్ కప్ ఎంజాయ్ చేసేందుకు సిద్ధమైపోయారు. ఇటీవలే అండర్ 19 టి20 వరల్డ్ కప్ ప్రారంభం అయింది అన్న విషయం తెలిసిందే. ఎంతో మంది యువ ఆటగాళ్లు అండర్ 19 వరల్డ్ కప్ లో సత్తా చాటి ఇక అంతర్జాతీయ జట్టులో స్థానం సంపాదించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలోనే యువ ఆటగాళ్లకు  ప్రతిభను చూసేందుకు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు కూడా సిద్ధమైపోయారు. ఇకపోతే అండర్-19 ప్రపంచకప్ లో భాగంగా నేడు భారత జట్టు తమ పోరు ప్రారంభించబోతుంది.

 ఇక అండర్ 19 ప్రపంచ కప్ లో భాగంగా భారత కుర్రాళ్లు తొలి మ్యాచ్లో సౌతాఫ్రికా ఆటగాళ్లను డీకొట్టబోతూన్నారు. ఈ టి20 మ్యాచ్ సాయంత్రం ఆరున్నర గంటలకు ప్రారంభం కాబోతుంది. ఇక ప్రస్తుతం భారత అండర్-19 జట్టు ఎంతో బలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఓపెనర్ హర్నూల్ సింగ్ సూపర్ పామ్ లో కనిపిస్తూ ఉండటం టీమిండియాకు ఎంతగానో కలిసి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇక ఆంధ్ర కుర్రాడు షేక్ రషీద్ కూడా మంచి ఫాంలో కొనసాగుతున్నాడు. ఇక కెప్టెన్ యష్ దుల్ కూడా ఎంతో కీలకంగా మారబోతున్నాడు. ఆల్రౌండర్ రాజ్ భవా రాణిస్తే ఇక జట్టుకు తిరుగు ఉండదు అని అంటున్నారు విశ్లేషకులు. ఇక అండర్ 19 వరల్డ్ కప్లో టీమ్ ఇండియా మొదటి మ్యాచ్ లో గెలిచి అదే జోరును కొనసాగించాలి అని అందరూ ఆల్ ది బెస్ట్ చెబుతుండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: