వార్నర్ కు చేసింది గుర్తులేదా.. ఇర్ఫాన్ పఠాన్ షాకింగ్ కామెంట్స్?

praveen
డేవిడ్ వార్నర్ విషయంలో సన్రైజర్స్ జట్టు యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరు గత కొంత కాలం గా హాట్ టాపిక్ గా మారిపోయింది అనే విషయం తెలిసిందే. ఏకంగా కెప్టెన్గా సన్రైజర్స్ జట్టుకు ఒక ఐపీఎల్ ట్రోఫీని అందించిన డేవిడ్ వార్నర్ ను రెండు మ్యాచ్ లలో రాణించినందుకు గాను జట్టు నుంచి పూర్తిగా పక్కన పెట్టారు. కనీసం మైదానంలోకి కూడా రానివ్వకుండా కేవలం హోటల్ గదికి మాత్రమే పరిమితం చేశారు. ఇలా వార్నర్  విషయంలో సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

  సన్రైజర్స్ యాజమాన్యం తన పట్ల వ్యవహరించిన తీరుపై పలుమార్లు ఇప్పటికే వార్నర్ కూడా ఎమోషన్ అయ్యారు అన్న విషయం తెలిసిందే.. తెలుగు ప్రేక్షకులందరితో తనకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది అని చెప్పుకొచ్చారు. ఇక తనకు సన్రైజర్స్ జట్టుతో బంధం ముగిసిపోయింది అంటూ తెలిపారు. అయితే ఇటీవలే ఏకంగా ఐపీఎల్ 2022 మెగా వేలం ముందు రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు డేవిడ్ వార్నర్ ను తీసుకోలేదు. ఈక్రమంలోనే డేవిడ్ వార్నర్ మెగా వేలం లోకి వచ్చేశాడు. ఇక ముందు నుంచి అందరూ అనుకున్నట్లుగానే హైదరాబాద్ యాజమాన్యం డేవిడ్ వార్నర్ ని పూర్తిగా వదులుకుంది.

 దీంతో ఇక సోషల్ మీడియా వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యంపై విమర్శలు గుప్పిస్తున్నారు అభిమానులు. ఇలా విమర్శలు రావడంపై స్పందించారు భారత మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక విదేశీ ఆటగాడిని రిటైన్ గురించి జట్టు యాజమాన్యం   నిర్ణయాన్ని చాలామంది ప్రశ్నిస్తున్నారు. కానీ వాళ్ళందరూ ఒకటి గుర్తుంచుకోవాలి. సొంత దేశం అతని నిషేధించినప్పుడు అదే జట్టు అతనికి మద్దతుగా ఉంది అంటూ ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు. అయితే ఇర్ఫాన్ పఠాన్  చేసిన పోస్టులో మాత్రం వార్నర్ పేరు గానీ సన్రైజర్స్ హైదరాబాద్ పేరు గాని ప్రస్తావించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: