జట్టులోకి కోహ్లీ ఎంట్రీ.. అతన్ని పక్కన పెట్టబోతున్నారట?

praveen
ప్రస్తుతం స్వదేశీ గడ్డపై న్యూజిలాండ్ జట్టుతో టెస్టు సిరీస్ ఆడనుంది టీమిండియా. ఇక ఈ టెస్ట్ సిరీస్ లో టీమిండియా ఒకరకంగా ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టు పై ఆధిపత్యాన్ని సాధిస్తుంది అని చెప్పాలి. ఇక టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకపోవడంతో ప్రస్తుతం టీమిండియా జట్టును కెప్టెన్గా ముందుకు నడిపిస్తున్నాడు అజింక్యా రహానే. అయితే అజింక్య రహానే గత కొన్ని రోజుల నుంచి పేలవ ఫామ్ తోనే నిరాశపరుస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ ప్రారంభం కాకముందు సెంచరీ చేయడానికి ప్రయత్నిస్తాను అని చెప్పాడు అజింక్య రహానె. దీంతో ఇక అందరూ కూడా అజింక్య రహానే నుంచి సెంచరీ వస్తుందని అంచనాలు పెట్టుకున్నారు.

 కానీ వరుసగా కెప్టెన్ అజింక్యా రహానే మాత్రం బ్యాటింగ్ లో పూర్తిగా విఫలం అవుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. దీంతో వరుసగా విఫలమవుతున్న అజింక్యా రహనే కు ఎందుకు ఇన్ని అవకాశాలు ఇస్తున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా భారత్ క్రికెట్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తొలిటెస్టులో విఫలమైన కెప్టెన్ రహానేను పక్కన పెట్టాలి అన్న డిమాండ్లు కూడా ప్రస్తుతం ఎక్కువైపోయాయి. అజింక్య రహానే  స్థానంలో మరొకరికి అవకాశం కల్పించిన కూడా ఎంతో బాగుంటుంది టీమిండియాకు కూడా కలిసి వస్తుంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 ఇకపోతే మొదటి టెస్టులో అందుబాటులో లేని రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో టెస్టు మ్యాచ్లో మాత్రం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సందర్భంగా వి.వి.ఎస్.లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్న అజింక్య రహానే కు మరో ఛాన్స్ దక్కే అవకాశం ఉందని వివిఎస్ లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు.. కోహ్లీ టీమ్ లోకి వస్తూ ఉండటంతో ఒక్కరిని పక్కన పెట్టాల్సి సమయం వచ్చిందని.. ఈ క్రమంలోనే రహానే కు బదులు శ్రేయస్ అయ్యర్ ను తప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు. రహానేను జట్టు నుంచి తప్పించేందుకు కోహ్లీ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఎక్కువగా మొగ్గు చూపకపోవచ్చు అంటూ అంచనా వేశాడు వి.వి.ఎస్.లక్ష్మణ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: