విదేశీ లీగ్ లో ఇండియన్ మహిళా కెప్టెన్ హవా?

VAMSI
క్రికెట్ లో ఇప్పుడు దేశానికి ఒక్కో టీ - 20 లీగ్ అవతరించింది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు కేవలం పురుషుల వరకు మాత్రమే ఉండే క్రికెట్ మ్యాచ్ లు, ఇప్పుడు మహిళలు కూడా ఆడుతున్నారు. అందులో భాగంగానే క్రికెట్ ఆస్ట్రేలియా వుమన్ బిగ్ బాష్ లీగ్ ను జరుపుతోంది. ఇప్పటి వరకు 6 సీజన్ లను విజయవంతంగా పూర్తి చేసుకుని ఈ రోజుతో సీజన్ 7 కూడా పూర్తి చేసుకుంది. అయితే ప్రపంచంలో జరిగే టీ 20 లీగ్ లలో ఇండియా నుండి క్రికెటర్లూ ఎప్పుడూ పాల్గొనింది లేదు. ఇందుకు బీసీసీఐ కూడా అనుమతి ఇవ్వదు. అయితే ఇందుకు మినహాయింపుగా విమెన్ బిగ్ బాస్ లీగ్ లో ఆడేందుకు ఇండియన్ మహిళా క్రికెటర్లను అనుమతించింది.
ఈ సీజన్ లో పాల్గొన్న ఇండియన్ మహిళా క్రికెటర్లు తమ సత్తా చాటారు. ముఖ్యంగా ఇండియన్ విమెన్ టీ 20 కెప్టెన్ గా ఉన్న హర్మన్ ప్రీత్ కౌర్ సీజన్ ఆసాంతం తనదైన ఆటతీరుతో ఆకట్టుకుని ప్రాతినిధ్యం వహించిన జట్టును ఫైనల్ ముందు వరకు తీసుకెళ్లింది. మెల్బోర్న్ రెనెగేడ్స్ తరపున బరిలోకి దిగిన హర్మన్ ప్రీత్ కౌర్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అబ్బురపరిచింది. ఛాలెంజర్ లో భాగంగా అడిలైడ్ స్ట్రైకర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలై ఇంటి బాట పట్టింది. ఈ రోజు కాసేపటి క్రితమే ముగిసిన ఫైనల్ లో పెర్త్ స్కార్చర్స్  చేతిలో అడిలైడ్ స్ట్రైకర్స్ 10 పరుగుల ఓటమి పాలయింది.
పెర్త్ స్కార్చర్స్ బిబిఎల్ చరిత్రలో తొలిసారి ట్రోపీని ముద్దాడింది. ఈ జట్టును కెప్టెన్ సోఫీ డివైన్ ఎంతో సక్సెస్ ఫుల్ గా ముందుండి నడిపించింది. ఈ సీజన్ మొత్తం అటు బౌలింగ్ మరియు బ్యాటింగ్ రెండు విభాగాల్లోనూ అత్యుత్తమ ప్రదర్సన కనబరిచిన హర్మన్ ప్రీత్ కౌర్ కు ప్లేయర్ అఫ్ ది టోర్నమెంట్ అవార్డు వరించింది. బ్యాటింగ్ లో 406 పరుగులు మరియు బౌలింగ్ లో 15 వికెట్లు సాధించి జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించింది. ఇలా ఒక ఇండియన్ మహిళా క్రికెటర్ విదేశీ లీగ్ లో తన హవా చూపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: