'సన్ రైజర్స్ హైద్రాబాద్' అతడిని వదులుకునే సాహసం చేస్తుందా?

VAMSI
ప్రస్తుతం ఐపీఎల్ ఫ్రాంచైజీలలో రీటెన్షన్ సందడి నెలకొంది. క్రికెట్ ప్రేమికులకు ఈ రీటెన్షన్ సంతోషాన్ని ఆతృతను కలిగించినా ఫ్రాంచైజీలకు మాత్రం ఇది ఒక అగ్ని పరీక్ష అని చెప్పాలి. ఎందుకంటే కొంతకాలంగా ఒకే ఫ్యామిలీ గా కలిసి ప్రయాణం చేసిన ఒక గ్రూప్ నుండి కేవలం నలుగురిని మాత్రమే ఉంచుకుని మిగిలిన వారిని వదిలెయ్యాలి. అందుకే ఫ్రాంచైజీ సెలక్షన్ సిబ్బంది ప్రణాళికలలో మునిగిపోయారు. అయితే కొన్ని ఫ్రాంచైజీలు ఇప్పటికే ప్లేయర్స్ పై ఒక క్లారిటీ తో ఉన్నారు. కానీ సన్ రైజర్స్ హైద్రాబాద్ మాత్రం ఏ నలుగురిని ఫ్రాంచైజీతో కంటిన్యూ చేయాలో అర్ధం కాక తలలు పట్టుకుంటోంది. అంతే కాకుండా ఈ సంవత్సరం జరిగిన ఐపీఎల్ 14 వ సీజన్ లో కనీసం ప్లే ఆప్స్ కు చేరుకోకపోవడంతో ఆటగాళ్ల పట్ల యాజమాన్యం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.
దీని కారణంగానే మాజీ కెప్టెన్ వార్నర్ పట్ల దారుణంగా ప్రవర్తించింది. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం కెప్టెన్ గా ఉన్న కేన్ విలియమ్సన్ ను మాత్రమే తమ జట్టుతో కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ వర్గాలు అనుకుంటున్నాయి. అయితే సన్ రైజర్స్ ను సక్సెస్ ఫుల్ టీం గా తయారవడంలో కృషి చేసిన సీనియర్ ప్లేయర్స్ అయిన భునేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్ లాంటి వారిని సైతం వదులుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే రషీద్ ఖాన్ ను వదులుకుంటే అది సన్ రైజర్స్ యాజమాన్యం చేసే మరో పెద్ద పొరపాటు అవుతుందని ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
కానీ రషీద్ ఖాన్ ను జట్టుతో కొనసాగించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయట, అయితే ఎంత మొత్తానికి అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదని తెలుస్తోంది. సన్ రైజర్స్ అభిమానులు అయితే రషీద్ ఖాన్ ను వదులుకోవద్దని సోషల్ మీడియాలో రచ్చ చేస్తోందట. రషీద్ ఖాన్ టీ 20 లలో ఎంత ప్రమాదమో తెలిసిందే. ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలడు. మరి సన్ రైజర్స్ చివరికి ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే మరో 3 రోజుల వరకు ఆగాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: