భారత జట్టుకు ప్రతిభ ఉంది.. కానీ ప్రపంచ కప్ గెలవాలంటే...?

M Manohar
రేపటి నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీ నిర్వహణ హక్కులు మన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకే ఉన్న కరోనా కారణంగా దీనిని యూఏఈ వేదికగా నిర్వహించాలి వస్తుంది. అయితే ఈ ప్రపంచ కప్ లో టీం ఇండియా టైటిల్ ఫెవరెట్ జట్లలో ఒక్కటి. భారత మాజీ కెప్టెన్ మరియు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ... విరాట్ కోహ్లీ నాయకత్వంలోని జట్టులో ప్రతిభకు కొరత లేదని అభిప్రాయపడ్డారు, కానీ టైటిల్‌ను సాధించడానికి వారు పరిపక్వతని ప్రదర్శించాలి అని అన్నారు. "ఎవరు సులభంగా ఛాంపియన్లుగా మారరు మరియు మీరు కేవలం టోర్నమెంట్‌లో అడుగు పెట్టడం ద్వారా ఛాంపియన్లుగా మారరు. ఇందులో విజయం సాధించాలి అంటే వారు మెచ్యూరిటీని ప్రదర్శించాలి" అని గంగూలీ చెప్పాడు. వారందరిలో ప్రతిభ ఉంది, ఈ స్థాయిలో పరుగులు చేయడానికి మరియు వికెట్లు తీయడానికి వారందరికీ నైపుణ్యం ఉంది. ప్రపంచ కప్ గెలవడానికి వారు మానసికంగా మంచి స్థానంలో ఉండాలి అని అన్నారు. టైటిల్‌ను నేరుగా లక్ష్యంగా చేసుకోవడానికి బదులుగా ప్రతి ఆటను గెలవడంపై దృష్టి పెట్టాలని గంగూలీ చెప్పాడు.
ఫైనల్స్ ముగిసినప్పుడు మాత్రమే టైటిల్ అందుకుంటారు. కాబట్టి, అంతకు ముందు మీకు చాలా క్రికెట్ ఆడాలి. ప్రతి గేమ్‌పై భారత జట్టు దృష్టి పెట్టాలని నేను అనుకుంటున్నాను. ఇండియా ప్రతి గేమ్ గెలవడంపై దృష్టి పెట్టాలి మరియు దాన్ని అక్కడ నుండి తీసుకొని టైటిల్ వైపుకు వెళ్ళాలి. కానీ ప్రారంభంలో టైటిల్ గురించి ఆలోచించవద్దు, "అని దాదా చెప్పాడు. ఎవరితో ఆడినా భారతదేశం ఎల్లప్పుడూ పోటీదారులుగా ఉంటుంది. ఫలితాల కంటే ప్రక్రియపై దృష్టి పెట్టండి అని సూచించాడు. అయితే ఈ నెల 24న టీం ఇండియా తన మొదటి మ్యాచ్ ను ఆడనుంది. ఇందులో చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ జట్టును భారత్ ఎదుర్కొంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: