టీ 20 : ఈ సారి 16 జ‌ట్లు ! ఫార్మెట్ ఎలా ఉంటుంది?

Dabbeda Mohan Babu
క్రికెట్ అభిమ‌నుల‌కు ఎంట‌ర్ టైన్ చేయాడినికి అక్టోబ‌ర్ 17 నుంచి టీ ట్వంటి వ‌ర‌ల్డ్ క‌ప్ ప్రారంభం కాబోతుంది. ఈ మెగా టోర్ని క‌రోనా వైర‌స్ వ‌ల్ల ఆల‌స్య మైన తాజాగా మ‌ళ్లి ప్రారంభం కానుంది. ఈ మ‌హా సంగ్రామం భార‌త్ జ‌ర‌గాల్సి ఉన్న క‌రోన వైరస్ ప్ర‌భావంతో యూఏఈ ఓమ‌న్ ల‌లో జ‌రుగుతుంది. కానీ ఈ టోర్ని కి మాత్రం అతిథ్యం వ‌హించే ది మాత్రం బీసీసీఐ నే. అయితే ప్ర‌తి ఏడాది కంటే ఈ ఏడాది ఈ టోర్ని లో పాల్గొనే దేశాల సంఖ్య పెరిగింది. ఈ ఏడాది ఏకంగా 16 దేశాలు ఈ మెగా టోర్నిలో త‌మ అదృష్టాన్ని ప‌రిక్షించు కోనున్నాయి. అయితే 16 దేశాల జ‌ట్లు ఆడే ప‌ద్ద‌తి కాస్త క‌న్‌ఫ్యూజ్ గా ఉంటుంది. అయితే ఈ మెగా టోర్ని షెడ్యూల్, ఫార్మెట్ లు ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ మ‌హా సంగ్రామం రెండు రౌండ్ల‌లో నిర్వ‌హించ‌బోతున్నారు. మొద‌టి రౌండ్ లో ఎనిమిది జ‌ట్లు ఉంటాయి. అయితే వీటిని నాలుగు నాలుగు జ‌ట్ల గా రెండు గా విభ‌జిస్తారు. అందులో గ్రూప్ ఏ నుంచి శ్రీ‌లంక‌, ఐర్లాండ్, నెద‌ర్లాండ్, న‌మీబియా జ‌ట్లు ఉన్నాయి. అలాగే గ్రూప్ బీ లో బంగ్లాదేశ్ తో పాటు స్కాట్లాండ్, పాపువా న్యూ గినియా, ఒమ‌న్ ఉంటాయి. గ్రూప్ లో ఉన్న ప్ర‌తి జ‌ట్టు మిగత ప్ర‌తి జ‌ట్టు తో త‌ల ప‌డుతాయి. అలా రెండు గ్రూప్ లో టాప్ రెండు గా ఉన్న జ‌ట్లు సూపర్ 12 అన‌గా.. రెండో రౌండ్ కు అర్హ‌త సాధిస్తాయి. అక్క‌డి ఈ నాలుగు జట్ల‌తో పాటు ఎన‌మిది అగ్ర శ్రేణి జ‌ట్ల‌తో మ‌ళ్లి రెండు గ్రూప్ లు గా విభ‌జిస్తారు. ఈ రెండో రౌండ్ లో గ్రూప్ ఏ లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికా, వెస్టిండీస్ తో పాటు ఏ1 బీ2 జ‌ట్లు ఉంటాయి. అలాగే గ్రూప్ బీ లో ఇండియా, పాకిస్ధాన్‌, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ తో పాటు బీ1, ఏ2 జ‌ట్లు ఉంటాయి.

ఈ రెండో రౌండ్ లో కూడా ప్ర‌తి జ‌ట్టు త‌న గ్రూప్ లో ఉన్న మిగితా జ‌ట్టు తో ఒక మ్యాచ్ ఆడుతుంది. ఇలా రెండు గ్రూప్ ల‌లో మొద‌టి రెండు స్థానాల్లో ఉన్న జ‌ట్లు సెమీ ఫైన‌ల్ కు చెరుతాయి. దీని త‌ర్వాత న‌వంబ‌ర్ 14 న  ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌బోతుంది. అలాగే ఈ మెగా టోర్ని ఫైన‌ల్ లో గెలిచిన వారికి 1.6 మిలియ‌న్ డాల‌ర్లు అన‌గా రూ. 12.02 కోట్లు ఇస్తారు. అలాగే ర‌న్న‌ర‌ప్ కు రూ. 6 కోట్లు గెలుచు కుంటుంది. దీని తో పాటు సెమీ ఫైన‌ల్ కు వ‌చ్చిన జ‌ట్ల కు రూ. 3 కోట్లు ద‌క్క‌నున్నాయి. అయితే ప్ర‌స్తుతం ఇంగ్లాండ్ తో పాటు డిఫెండింగ్ ఛాంపియ‌న్ వెస్టిండిస్, భారత్ తో పాటు న్యూజీలాండ్, పాకిస్థాన్ జ‌ట్లు మంచి ఫాం లో ఉన్నాయి. ఈ టీమిండియా మెంట‌ర్ గా ఎమ్ ఎస్ ధోని వ‌స్తుండ‌టం తో టీమిండియా పై అంచనాలు భారీగా పెరిగాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: