ఐపీఎల్ 2021 : సూపర్ కింగ్స్ సూపర్ విజయం...

M Manohar
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా కరోనా నియమాల మధ్య జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ ముగిసింది. అయితే ఈ రోజు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021లో ఫైనల్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్. కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్లో 193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి వచ్చిన కేకేఆర్ జట్టుకు అద్భుతమైన ఆరంభం దొరికింది. ఇద్దరు ఓపెనర్లు గిల్(51), వెంకటేష్ అయ్యర్(50) అర్థ శతకాలు సాధించారు. వీరిరువురు మొదటి వికెట్ కు 91 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ ఆ తర్వాత వచ్చిన కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాట్స్మెన్ ఎవరు రాణించలేదు. నితీష్ రానా గోల్డెన్ డక్ కాగా సునీల్ నరైన్ రెండు పరుగులు చేసి అవుటయ్యాడు. అనంతరం దినేష్ కార్తీక్ 9 పరుగులు చేయగా షకీబ్ అల్ హసన్ గోల్డెన్ డక్ గా వెనిదిరిగాడు. అలాగే రాహుల్ త్రిపాఠి కూడా కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరుకున్నాడు. అలాగే కేకేఆర్ కెప్టెన్ మోర్గాన్ కూడా ఎనిమిది బంతుల్లో నాలుగు పరుగులు చేసి నిరాశపరిచాడు. అయితే చివర్లో శివమ్ మావి(20), లాకీ ఫెర్గూసన్(18) కొంత పరుగులు చేసిన అప్పటికే మ్యాచ్ చెన్నై చేతిలోకి వెళ్ళిపోయింది.
దాంతో 20 ఓవర్లలో కేకేఆర్ 165 పరుగులు చేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ 27 పరుగుల తేడాతో ఈ మ్యాచ్లో విజయం సాధించడమే కాకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో నాల్గవ టైటిల్ ను తన ఖాతాలో వేసుకుంది. అయితే రెండు జట్లు 2012 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో ఎదురు పడినప్పుడు కేకేఆర్ చెన్నై పై విజయం సాధించింది. కానీ ఇప్పుడు దానిని తిరగరాయలేకపోయింది. ఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఓపెనర్ డుప్లెసిస్(86) అర్థ శతకం తో రాణించగా మిగతా ముగ్గురు బ్యాట్స్మెన్ 30 కి పైగా పరుగులు చేయడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 192 పరుగులు చేసి మూడు వికెట్లను కోల్పోయింది. ఇక గత ఐపీఎల్ లో అత్యంత పేలవ ప్రదర్శన చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ ఏడాది టైటిల్ అందుకోవడంతో ఆ జట్టు అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: