టీమిండియా నెక్ట్స్ కోచ్ ఆయ‌న నేనా?

Dabbeda Mohan Babu
ఇండియా క్రికెట్ టీం కు కొత్త కోచ్ రాబోతున్నారు. ఇప్పుడు కోచ్ బాధ్య‌త‌ల్లో ఉన్న ర‌వి శాస్త్రి మ‌రియు ఆయ‌న స‌హాయ‌క సిబ్బింది ప‌ద‌వి కాలం రాబోతున్న టీ ట్వంటి వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వ‌త ముగిసి పోతుంది. ఆయ‌న త‌ర్వాత టీమిండియా కు కొత్త గా కోచ్ బాధ్య‌త‌లు నిర్వ‌హిచేది ఎవ‌రు అనే ప్ర‌శ్న స‌గ‌టు క్రికెట్ అభిమానిని ఈ ప్ర‌శ్న వేధిస్తుంది. అలాగే బీసీసీఐ కూడా కోత్త కోచ్ కోసం తెగ అన్వేషిస్తుంద‌ని తెలుస్తొంది. త్వ‌ర‌లో భార‌త్ తో మ్యాచ్ లు ఆడ‌టానికి న్యూజిలాండ్ ఇండియా కు రాబోతుంది. ఇలోగా కొత్త కోచ్ ను తీసుకు రావాల‌ని బీసీసీఐ భావిస్తున్న‌ట్టు సమాచారం. దాని కోసం త్వ‌ర‌లోనే అంటే ఈ వారం లోగ కోచ్ కోసం ద‌ర‌ఖాస్తుల ను స్వీక‌రించే అవ‌కాశం ఉంది.

అయితే రావి శాస్త్ర త‌ర్వాత టీమిండియా కు కోచ్ గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ డానికి చాలా మంది ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు స‌మాచారం. ముఖ్యంగా ఆస్ట్రేలియా మాజీ ఆట‌గాడు టామ్ మూడీ ఆస‌క్తి తో ఉన్నాడు. ఇదివ‌ర‌కే అవ‌కాశం ఉంటే టీమిండియా కు కోచ్ గా ఉంటాన‌ని గ‌తంలో చాలా సార్లు ప్ర‌క‌టించాడు. అయితే బీసీసీఐ కూడా టామ్ మూడీ వైపే మొగ్గు చూపే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తొంది. అలాగే ద్రవిడ్ కోచ్ గా బాధ్య‌త‌లు తీసుకోవ‌డానికి అవ‌కాశం ఉన్న.. ద్రావిడ్ కోచ్ ప‌ద‌వి పై ఆస‌క్తి తో లేడ‌ని స‌మాచారం. అలాగే కుంబ్లే పేరు కూడా వినిపించినా.. ఆయ‌న కూడా తిర‌స్కరించాడని తెలుస్తోంది. అంతే కాకుండా శ్రీ‌లంక మాజీ ఆట‌గాడు మ‌హేలా జ‌య‌వ‌ర్ధ‌నే పేరు కూడా వినిపించింది. అయితే మ‌హేల కూడా ప్ర‌స్తుతం పెద్ద‌గా ఆస‌క్తి చూప‌డం లేద‌ని తెలుస్తోంది. దీంతో టామ్ మూడీ టీమిండియా కు కాబోయే కోచ్ అని తెలుస్తోంది. టామ్ మూడి ప్ర‌స్తుతం శ్రీ‌లంక టీమ్ తోపాటు ఐపీఎల్ లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కు డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: