ఎట్టకేలకు ఆఫ్ఘన్ నుండి బయటకు వచ్చిన క్రికెట్ జట్టు...

M Manohar
అక్టోబర్ 17 నుండి యుఎఇ మరియు ఖతార్‌లో జరిగే ఐసిసి టి 20 ప్రపంచకప్‌లో పాల్గొనడానికి ఆఫ్ఘనిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు బుధవారం యూఏఈ లోని దోహాకు చేరుకుంది. అయితే 2021 టీ 20 వరల్డ్ కప్ ఫైనల్స్‌కు ఆఫ్ఘనిస్తాన్ నేరుగా అర్హత సాధించిన విషయం తెలిసిందే. అలాగే గ్రూప్ 2 లో భారతదేశం, పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్‌తో పాటు స్థానం పొందింది ఆఫ్ఘన్ జట్టు. ఇక అక్టోబర్ 17న ప్రారంభమయ్యే క్వాలిఫయర్‌ తర్వాత మరో రెండు జట్లు వారితో పాటు గ్రూప్ 2 లో చేరతాయి.
అయితే ఆఫ్ఘన్ జట్టు ఖతార్‌ రావడం పై ఆ దేశ అసిస్టెంట్ విదేశాంగ మంత్రి లోల్వా అల్ఖాటర్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. తాలిబాన్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఆఫ్ఘన్ బృందం ఇక్కడికి చేరుకుంది. కాబట్టి వారు రాబోయే టీ 20 ప్రపంచ కప్ కు ముందు వారు ఇక్కడే శిక్షణా శిబిరంలో పాల్గొనవచ్చు అని తెలిపారు. అయితే ఈ నెల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగే టీ 20 ప్రపంచకప్‌లో పాల్గొనడానికి ఈ జట్టుకు ఇంకా 10 రోజుల గడువు ఉంది. అయితే ఈ ప్రపంచ కప్ లో పాల్గొనాలంటే ఈ జట్టు ఆఫ్ఘనిస్తాన్ జెండాతోనే ఆడాలని.. ఒకవేళ తాలిబన్ ల జెండాతో అయితే వారిని టోర్నీ నుండి తీసేస్తామని ఐసీసీ చెప్పిన విషయం తెలిసిందే.
అయితే ఆఫ్ఘన్ జట్టు ఖతార్‌కి వచ్చిన విమానంలో జపాన్, బెల్జియం, ఐర్లాండ్, బ్రిటన్, జర్మనీ, ఫిన్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, స్వీడన్ మరియు కెనడా అలాగే ఇతర దేశాలకు చెందిన వారు మరియు ఆఫ్ఘన్ జర్నలిస్టులు కూడా ఉన్నారు. అయితే ఆగస్టులో యుఎస్ బలగాలు ఆఫ్ఘన్ నుండి ఉపసంహరించుకున్న తర్వాత అక్కడ కాబూల్ నుండి బయలుదేరిన ఆరవ చార్టెడ్ విమానం ఇది. ఇందులో ఆటగాళ్లతో పాటు వివిధ దేశాలకు చెందిన వారు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఖతార్‌ వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: