మా నాన్న ఉంటే బాగుండేది.. కోహ్లీ ఎమోషనల్ కామెంట్స్?

praveen
టీమిండియా డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ..  ఈ పేరుకు కేవలం భారత్లోనే మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఓవైపు టీమ్ ఇండియా కెప్టెన్ గా మాత్రమే కాకుండా ఒక దిగ్గజ బ్యాట్స్మెన్ గా కూడా తన కంటూ ఒక ప్రత్యేకమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. ఓ వైపు జట్టును ఎంతో విజయవంతంగా ముందుండి నడిపిస్తునే మరోవైపు ఇక జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ. అయితే విరాట్ కోహ్లీ తన ప్రేయసి అనుష్క శర్మ ను వివాహం చేసుకున్నారు. అయితే ఇటీవలే వీరి ప్రేమకు గుర్తుగా ఒక కూతురు కూడా పుట్టింది. కూతురికి వామిక అని నామకరణం చేశారు.

 అయితే ఇటీవలి కాలంలో అటు అనుష్క శర్మ మరోవైపు విరాట్ కోహ్లీ కూడా తన కూతురు వామిక కు సంబంధించిన పలు విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.  ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు ఇద్దరు. అయితే ఇటీవలే  ఒక ఇంటర్వ్యూ కు హాజరైన విరాట్ కోహ్లీ తన తండ్రిని తలచుకొని ఎంతో ఎమోషనల్ అయ్యారు  తన తండ్రి తన కూతురిని చూసి ఉంటే ఎంతో బాగుండేది అంటూ భావోద్వేగ పూరితమైన వ్యాఖ్యలు చేశారు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి. ఇటీవలే టీమిండియా క్రికెటర్  దినేష్ కార్తీక్ విరాట్ కోహ్లీ ని ఇంటర్వ్యూ చేశాడు.

 ఇక ఇంటర్వ్యూ సరదా సరదాగా సాగిపోయింది. అయితే ఇంటర్వ్యూ జరుగుతున్న సమయంలో విరాట్ కోహ్లీ తన తండ్రిని గుర్తు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తన తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనలయ్యారూ. మా నాన్న నేను బాగా ఆడుతున్న సమయంలో నా ఆటను చూడలేదు.. ఇక ఇప్పుడు తన కూతురు వామిక ను కూడా నాన్న చూడలేక పోయారు.. వామికను నాన్న చూసి ఉంటే ఎంత ఆనంద పడేవారో.. ఇక ఇప్పుడు ఆ సంతోషాన్ని మొత్తం మా అమ్మ కళ్ళలో చూస్తున్నాను..  అదే మా నాన్న ఉండి ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి అంటూ విరాట్ కోహ్లీ భావోద్వేగ పూరితమైన వ్యాఖ్యలు చేశాడు. కాగా విరాట్ కోహ్లీ తండ్రి 2006లో అనారోగ్యంతో  మరణించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: