పంజాబ్ పై ఢిల్లీ ఘన విజయం..!

shami
ఐ.పి.ఎల్ మ్యాచ్ ల పోటీ రసవత్తరంగా మారుతుంది. ఫాంలో ఉన్న జట్టులు విజయ విహారాన్ని కొనసాగిస్తుంటే ప్రత్యర్ధుల ధాటికి చేతులు ఎత్తేసే పరిస్థితి కనబడుతుంది. ఐ.పి.ఎల్-9 లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తొలి విజయాన్ని అందుకున్నారు. పంజాబ్ ను చిత్తు చేసి ఐ.పి.ఎల్ లో మంచి నైపుణ్యాన్ని కనబరచింది.


ఈ ఐ.పి.ఎల్ సీజన్ లో మొదటి మ్యాచ్ కోల్ కతా చేతిలో ఓడి పోయిన ఢిల్లి ఈ మ్యాచ్ పై ఎక్కడ పట్టు విడువలేదు. ఢిల్లీ జట్టు ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ అన్ని రంగాల్లో మంచి నైపుణ్యంతో అదరగొట్టి పంజాబ్ ఆటగాళ్లను బెంబేలెత్తేలా చేశారు.


తొలిత బౌలింగ్ చేసిన ఢిల్లి పంజాబ్ బ్యాట్స్ మన్ ను 20 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 111 పరుగులను మాత్రమే కట్టి చేశారు. ఢిల్లీ బౌలర్ అమిత్ మిశ్రా తన సత్తా చాటాడు. వేసిన నాలుగు ఓవర్లలో 4 వికేట్లకు కేవలం 11 పరుగులే ఇచ్చి మెరుగైన ప్రదర్శనను కనబరిచాడు. 


మన్నన్ వోహ్రా (24 బంతుల్లో 32; 5 ఫోర్లు), ప్రదీప్ సాహు (12 బంతుల్లో 18 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్)ఢిల్లి బౌలర్లను ఎదుర్కునే ప్రయత్నం చేశారు. ఇక 20 ఓవర్లలో 112 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లి 13.3 ఓవర్లోనే 2 వికెట్ల నష్టానికి 113 పరుగులను సాదించారు.


స్కోరు వివరాలు :


కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: విజయ్ రనౌట్ 1; వోహ్రా (బి) మిశ్రా 32; మార్ష్ (స్టం) డికాక్ (బి) మిశ్రా 13; మిల్లర్ ఎల్బీడబ్ల్యు (బి) మిశ్రా 9; మ్యాక్స్‌వెల్ (సి) బ్రాత్‌వైట్ (బి) మిశ్రా 0; అక్షర్ (సి) నేగి (బి) జయంత్ 11; సాహా రనౌట్ 3; జాన్సన్ (బి) మోరిస్ 4; మోహిత్ (సి) మోరిస్ (బి) జహీర్ 15; ప్రదీప్ సాహు నాటౌట్ 18; సందీప్ శర్మ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 111.
వికెట్ల పతనం: 1-8; 2-37; 3-52; 4-52; 5-59; 6-65; 7-73; 8-90; 9-99.
బౌలింగ్: జహీర్ 4-1-14-1; నేగి 1-0-10-0; మోరిస్ 4-0-19-1; బ్రాత్‌వైట్ 4-0-33-0; మిశ్రా 3-0-11-4; జయంత్ యాదవ్ 4-0-23-1.


ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: డికాక్ నాటౌట్ 59; అయ్యర్ (సి) సాహా (బి) సందీప్ 3; శామ్సన్ (బి) అక్షర్ 33; పవన్ నేగి నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: (13.3 ఓవర్లలో 2 వికెట్లకు) 113.
వికెట్ల పతనం: 1-9; 2-100.
బౌలింగ్: సందీప్ 2-1-6-1; జాన్సన్ 3-0-28-0; మోహిత్ శర్మ 2-0-10-0; అక్షర్ పటేల్ 3-0-25-1; ప్రదీప్ సాహు 2.3-0-27-0; మ్యాక్స్‌వెల్ 1-0-11-0. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: