దసరా.. విజయానికి దండోరా..!

నేడు దసరా మహోత్సవాన్ని జరుపుకుంటుంది భారతదేశం. ధర్మం గెలిచిందని, రాక్షస సంహారం జరిగిందని ప్రజలు ఇక శాంతియుతంగా జీవించవచ్చు అనే నేపథ్యంలో ఈ పండుగ జీవం పోసుకుంది. దైవం చెప్పినట్టుగా కృష్ణపరమాత్మ చెప్పినట్టుగా ధర్మగ్రంధాలలో ఉన్నట్టుగా ధర్మానికి కష్టం వస్తే దానిని రక్షించడానికి అవతారమూర్తిగా తాను వస్తానని మాట ఇచ్చాడు. అలాగే ఆయా అవతారాలతో అనేక మంది రాక్షసులను సంహారం చేసిన తరువాత ధర్మ సంస్థాపన గావించబడింది. ఇవన్నీ లోకంలో ధర్మాన్ని మాత్రమే ఆచరించే వారిని రక్షించడానికి దేవుడు తీసుకున్న అవతారాలే. ప్రతి అవతారానికి ఒక ప్రాధాన్యత ఉండటం వెనుక ఆయా ఆ రాక్షసుల సంహారానికి ఉన్న దారులను వెతుకుతూ ఉండటమే.
రాక్షసులు ఎప్పుడూ శాశ్వతంగా జీవించాలనే ఘోరంగా తప్పస్సులు చేసేవారు, ఆ తపోశక్తిని తట్టుకోలేక ఆయా దైవాలు కూడా ప్రత్యక్షం అవడం ఆయా రాక్షసులకు వరాలు ఇవ్వడం జరుగుతుండేది. వరాలు ఇచ్చేప్పుడు శాశ్వతంగా జీవించాలి అనే రాక్షసులు అడిగేది, కానీ అది సృష్టి ధర్మానికి విరుద్ధం, వేరే వరం కోరుకోవాలని దైవం అడుగుతుంది. అప్పుడు ఆ రాక్షసులు తెలివిగా దాదాపు మరణం అసాధ్యం అన్నట్టుగా అనేక మెలికలతో వరాలు కోరతారు. అప్పుడు దైవం ఆ వరాలు ఇవ్వాల్సి వస్తుండేది. అలా వరం ఇచ్చాక మరి ఆ రాక్షసులు ఊరికే ఉండరు, తమకు చావు లేదు అనే అహంకారంతో ప్రవర్తిస్తూ ముల్లోకాలను ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాంటి సమయంలో సాధారణ ప్రజలు సహా మూడు లోకాలలో ఉన్న వారు దైవాన్ని రక్షించాలని కోరగా, అప్పుడు దైవం రాక్షసుడు పొందిన వరానికి విరుగుడు లాంటి అవతారం వెతకాల్సి ఉంటుంది. అదే తరహాలో అవతారం స్వీకరించాల్సి ఉంటుంది.  
అందుకే లోకంలో ఇన్ని అవతారాలు. ఆయా అవతారాలు ఆయా రాక్షసుల కోరికలను తగ్గట్టుగా సంహారం కోసం దైవం తీసుకున్నవి. రామావతారం, తీసుకుంటే, రాముడు మనిషిగా వేల ఏండ్లు భూమిపై పరిపాలన చేశాడు. ఆ అవతారం అలా ఎందుకు వచ్చింది అంటే, ఆ రాక్షసుడు ఏవిధంగా వరం పొందాడు అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. రావణుడు ఎలా వరం పొందాడు, తనను మనిషి ఏమి చేయగలడు, తుచ్ఛమైన జివి అంటే అది మనిషే అని వాడికి అభిప్రాయం. అందుకే మనిషి తక్క ఎవరితోనూ తన మరణం జరగరాదు అని తపస్సు చేసి కోరుకున్నాడు. అందుకే దైవం మనిషిగా వచ్చాడు. ఆ మనిషిగా వచ్చి కూడా రాక్షస సంహారం తో అవతారం చలించలేదు. ఎందుకంటే మనిషి కేవలం సంకల్పం చేత తన తలరాతను కూడా మార్చుకునే శక్తీ ఉందని తెలియజేయడానికి ఆయన 11000ఏళ్ళు భూమిపై అనేకానేక కష్టాలు ఓర్చుకుంటూనే బ్రతికాడు. ఒక్కనాడు ఆయనే దైవం అని ఎవరు చెప్పినా ఒప్పుకోలేదు, అలా ప్రవర్తించలేదు. అందుకే ఈనాటికి దైవం అనగానే రాముడి పేరు ముందు ఉంటుంది.  ధర్మం నశించే స్థితికి వచ్చినప్పుడు దానిని రక్షించడానికి దైవం అవతారరూపంలో వస్తాడు. ఆ సంహారం జరిగినప్పుడు చేసుకునేదే విజయం, సంతోషం, శాంతి, ధర్మం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: