స్మరణ: సినిమాల కోసం లెక్చరర్ వృత్తిని వదిలేసిన టాప్ కమెడియన్ ?

VAMSI
తెలుగు సినిమాలు దొరికిన కమెడియన్ లలో అతి కొద్ది మాత్రమే ప్రేక్షకుల అభిమానాన్ని పొందగలిగారు. అటువంటి వారిలో ఒకరే ఎమ్మెస్ నారాయణ. ఈయన 16 ఏప్రిల్ 1951 సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు గ్రామంలో జన్మించారు. వీరిది రైతు కుటుంబం. చదువు అంటే ఎమ్మెస్ కు చాలా ఆసక్తి. వీరి కుటుంబంలో మొత్తం 10 మంది పిల్లలు. కాబట్టి ఎమ్మెస్ నాన్న ఆర్థికంగా బాగా చితికిపోయి ఉండడం వలన స్కూల్ కి పంపే స్థోమత ఉండేది కాదు. అయినా ఎమ్మెస్ పక్కనే ఉన్న ఇల్లందులో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు. టెన్త్ తరువాత పతేపురం లోని ప్రాచ్య కాలేజ్ లో ఐదు సంవత్సరాలు లాంగ్వేజ్ కోర్స్ ను పూర్తి చేశాడు.
అదే కాలేజ్ లో ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ  లెక్చరర్ గా పనిచేస్తూ ఉండేవారు. ఎంఎస్ ఈయన దగ్గరే శిష్యుడిగా ఉంటూ ఒక రచయితగా మంచి నైపుణ్యాన్ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి జరగడం , లెక్చరర్ గా ఉద్యోగం రావడం చకచకా జరిగిపోయాయి. కానీ చిన్నప్పటి నుండి తనకు నటన అంటే ఎదో తెలియని అనుభూతి ఉండేది. కానీ తనకున్న కష్టాల వలన నటనలో మెళకువలు నేర్చుకునే అవకాశం దొరకలేదు. అయితే ఇక్కడే ఎమ్మెస్ ఒక ప్రయోగాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. హాయిగా లెక్చరర్ గా చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించాడు సినిమా రంగంలోకి వెళ్ళడానికి ఏకంగా తన ఉద్యోగాన్ని వదిలేయడానికి నిర్ణయించుకున్నాడు. ఈ విషయం పట్ల ఎంతో మంది వారిస్తున్నా ఎవ్వరూ మాట వినకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాడు.
అలా తన లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమా రంగం వైపు వెళ్లారు. అయితే వెళ్ళగానే రెడ్ కార్పెట్ వేయడానికి ఇండస్ట్రీ సిద్దంగా ఉండదు కదా, కానీ పరుచూరి వారి సహాయంతో రచయితగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత నటుడిగా 700 పై చిత్రాల్లో నటించి తన కంటూ ఒక మార్క్ ను ఏర్పరుచుకున్నాడు. అయితే సొంత ఊరిపై ప్రేమ ఎప్పటికీ పోలేదు. ఎంత బిజీగా ఉన్నా రెండు రోజులు షూటింగ్ లేకపోతే చాలు నిడమర్రు కి వచ్చేసే వాడు. అదే విధంగా 2015 లో సంక్రాంతి పండుగకు వచ్చిన ఎమ్మెస్ నారాయణ అనారోగ్యం కారణంగా నాలుగు నెలలు ఇబ్బంది పడి ఏప్రిల్ లో కనుమూశారు. ఈ ఇండస్ట్రీ ఒక మంచి కమెడియన్ ను కోల్పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: