స్మరణ : కునాల్ సింగ్ ఆత్మహత్య వెనుక ఉన్న రహస్యం ఇదే..

Divya

కునాల్ సింగ్ అంటే ఎవరికీ బహుశా గుర్తు ఉండకపోవచ్చు.. కానీ  ప్రేమికుల రోజు సినిమా అంటే చాలు.. టక్కున గుర్తుపట్టేస్తారు. కదిర్ దర్శకత్వంలో రూపొందిన ప్రేమికులరోజు సినిమాలో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇక ఇందులో అందాల తార సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించి , అందరిని మెప్పించారు. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. కునాల్ సెప్టెంబర్ 29 1977 లో హర్యానాలో జన్మించారు.  అయితే  కునాల్ తెలుగులోకి పరిచయం అవ్వకముందే, హిందీలో 1999లో కాదలర్ ధినం అనే హిందీ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.
ఇక కునాల్ కేవలం హిందీ లోనే కాదు తమిళ్, తెలుగు సినిమాలలో కూడా నటించి అందరినీ మెప్పించాడు. అయితే ఈయన నటించిన అన్ని సినిమాలు పరాజయం పొందినప్పటికీ, విమర్శకుల ప్రశంసలు మాత్రం పొందాయి. ఇక కునాల్  కేవలం నటుడిగానే కాకుండా అసిస్టెంట్ ఎడిటర్ గా కూడా కొన్ని చిత్రాలకు పని చేశాడు. ఆ తర్వాత నిర్మాత కావాలని ట్రై చేశాడు. కానీ వీలుపడలేదు.

అయితే తన నటనతో అందరిని మెప్పించిన కునాల్ అనుకోకుండా మరణించాడు. ఇక ఈ వార్త విన్న సినీ ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోయింది. అంత మంచి హీరోని సినీ ఇండస్ట్రీ కోల్పోవడం విషాదకరమైన సంఘటన. ముంబై ఓపివర లోని తన ఇంట్లో బుధవారం సాయంత్రం సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకొని అతను చనిపోయినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేల్చారు. ఇక ఈ సంఘటన జరిగిన సమయంలో అతని స్నేహితురాలు లవీన కూడా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది.

కానీ కునాల్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏమిటో మాత్రం ఇప్పటికీ తెలియరాలేదు. కునాల్ కు  భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వారి వ్యక్తిగత జీవితంలో ఎలాంటి కోపతాపాలు కానీ భావోద్వేగాలు కానీ లేవని వారి సన్నిహితులు చెప్పినట్లు సమాచారం. అయితే ఈయన మరణం వెనుక ఉన్న రహస్యం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ సినీ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ ను  సాధించలేకపోయానన్న   దిగులుతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు మరి కొంతమంది చెబుతున్నారు. అయితే ఏది ఏమైనా తన మరణం వెనుక ఉన్న రహస్యం మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది . కానీ సినీ ఇండస్ట్రీ మాత్రం ఒక మంచి నటుడిని కోల్పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: