హెరాల్డ్ స్మ‌రామీ : ఆస్తినంతా నోబుల్ బ‌హుమ‌తుల కోసం దార‌దాత్తం చేసిన అల్ఫెడ్‌...

Spyder
ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది ‘నోబెల్’ పురస్కారం. విజ్ఞానశాస్త్రం, కళలు, వైద్యరంగం, సాహిత్యం, ప్రపంచ శాంతి వంటి రంగాలలో నిష్ణాతులైనవారికిచ్చే గుర్తింపు ఇది. ఈ పురస్కారాన్ని మానవాళికి అత్యంత ప్రయోజనకరమైన ఆవిష్కరణలు చేసిన వారికి ఇస్తారు. ఏటా నామినేషన్లు అక్టోబరులో మొదలవుతాయ‌న్న విష‌యం దాదాపుగా అంద‌రికీ తెలిసిందే. నోబుల్ బ‌హుమ‌తి ప్ర‌దానాల స్థాప‌న వెనుక ఆస‌క్తిక‌ర ప‌రిణామాల చ‌రిత్ర దాగి ఉంది.  ఆల్‌ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్  (అక్టోబర్ 21, 1833, స్టాక్‌హోం, స్వీడన్ – డిసెంబర్ 10, 1896, సన్రీమో, ఇటలీ) స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త, ఇంజనీరు, ఆవిష్కారకుడు, మిలిటరీ ఆయుధాల తయారీదారు, డైనమైట్ ఆవిష్కారకుడు కూడా.

ఒక పాత ఇనుము, స్టీల్ మిల్లును తీసుకొని బొఫోర్స్ అనే మిలిటరీ ఆయుధాలను తయారు చేసే కంపెనీ స్థాపించాడు.  పేటెంట్ల ద్వారా విశేషంగా ధనం ఆర్జించాడు. ఆ ధనాన్ని ఒకచోట మూలధనంగా ఉంచి, ‘నోబెల్ ఫౌండేషన్’ అనే సంస్థ ద్వారా ఆ మూల ధనంపై వచ్చే వార్షిక వడ్డీని నోబెల్ పురస్కారాల రూపంలో ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఏటా ఈ పురస్కారాలను వివిధ రంగాలలో నిష్ణాతులైన మేధావులకు అందజేయవలసిందిగా వీలునామా రాసిన కొద్దిరోజుల త‌ర్వాత మ‌ర‌ణించాడు. అప్ప‌టి నుంచి నోబుల్ పేరు మీదుగా అవార్డుల‌ను అంద‌జేస్తున్నారు. ఆల్‌ఫ్రెడ్ నోబెల్... తాను జీవితకాలమంతా సంపాదించిన ధనాన్ని  తృణప్రాయంగా పరిత్యజించటం వెనుక బలమైన కారణమే ఉంది.

నేడు భౌతిక, రసాయన, వైద్య, ఆర్థిక శాస్త్రాలలోనే కాకుండా... సాహిత్యం, శాంతి రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అందిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత నోబెల్‌ పురస్కారం ఈయన పేరుమీదన స్థాపించబడింది. ఆల్‌ఫ్రెడ్ నోబెల్‌ 1895 నాటి వీలునామా ప్రకారం 1901లో ఈ పురస్కారం ప్రారంభించబడింది (నోబెల్‌ మరణించిన 5 సంవత్సరాల తరువాత). ఆల్‌ఫ్రెడ్ నోబెల్‌ గౌరవార్ధం శాంతి బహుమతి మటుకు 1969 నుండి బ్యాంక్‌ ఆఫ్‌ స్వీడన్‌ ద్వారా ఇవ్వడం జరుగుతోంది. ఈ ఆరు బహుమతులు అత్యధిక పారితోషికంతో పాటు పేరు ప్రఖ్యాతలకు నిదర్శనం. ప్రతీ సంవత్సరం, ఒక్క శాంతి బహుమానం తప్ప మిగతా ఐదు బహుమతులు నోబెల్‌ వర్ధంతి అయిన డిసెంబరు 10 నాడు, స్టాక్‌హోంలో ఇవ్వబడతాయి. వివిధ రంగాలలో విశేషమైన కృషి, పరిశోధనలు చేసిన, విప్లవాత్మక విధానాలు,  పరికరాలతో శాస్త్రాన్ని ముందంజ వేయించిన, మానవ సమాజానికి ఆ శాస్త్రంతో అత్యంత సహాయాన్ని అందించిన వ్యక్తులకు, సంస్థలకు (శాంతి బహుమతి మాత్రమే) ఇవ్వబడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: