మంచిమాట: సోమరిగా ఉంటే జీవితం లో కష్టాలు తప్పవు..!!

Divya
అనగనగా ఒక ఊర్లో ఒక కమ్మరి ఉండేవాడు. అతడు తన కొలిమిలో ఒక ఇనుప ముక్కతో రెండు నాగళ్ళు చేశాడు. మొదటి నాగలి ఆ కమ్మరి తో తనను ఎవరికైనా అమ్మి వేయి.. పొలం దున్ని పంట సాగుకు ఉపయోగపడతాను అంది. రెండో నాగలి మాత్రం నన్ను ఎవరికీ అమ్మ వద్దు. మీ దగ్గరే ఉంటాను.. నేను పని చేయలేను అంది. అవి కోరినట్లే కమ్మరి మొదటి నాగలిని ఓ రైతుకు అమ్మేశాడు. రెండో నాగలిని మాత్రం తన శాలలో ఓ మూలన పడేసాడు.
కొంతకాలానికి ఏదో పని మీద రైతు నాగలి పట్టుకొని కమ్మరి దగ్గరకు వచ్చాడు. ఈ నాగలి ఉన్నప్పటికంటే తళతళ మెరుస్తోంది. కమ్మరి దగ్గరే ఉన్న నాగలి మాత్రం తుప్పుపట్టి ఒక మూలన పడి ఉంది. మనమిద్దరమూ ఒకే ఇనుము ముక్క నుంచి తయారయ్యాం. నేనేమో తుప్పుపట్టి ఇలా అధ్వానంగా ఉన్నాను. మరి నువ్వేమో ఎంచక్కా మెరుస్తున్నావు.. అని ఎందుకు? అని అడిగింది రెండవ నాగలి.
ఇక రెండవ నాగలి ప్రశ్నకు బదులుగా...ఆ మొదటి నాగలి సమాధానమిస్తూ.. నా యజమాని నాతో రోజు పొలం దున్ని నన్ను సాన పెడతాడు.అందుకే నేను ఇంతలా తల తలా మెరుస్తున్నాను.  కానీ నీకా అవకాశం లేదులే..ఎందుకంటే నువ్వు ఏమీ పనిచేయలేవు కదా.. కాబట్టి ఎప్పటిలాగే ఉండిపోయావు. చూడు చూడడానికి ఎంత విహీనంగా ఉన్నావో.. ఇప్పటికైనా పని చేయడంలోనే అందం, ఆనందం ఉన్నాయని గ్రహించు అని చెప్పింది మొదటి నాగలి.ఇక  ఆ రోజే మూలనున్న నాగలి తనని కూడా ఎవరైనా రైతుకి అమ్మి వేయమని కమ్మరి తో చెప్పింది. అలా  ఎవరైనా సరే పని చేయడంలోనే సంతృప్తి దొరకడంతో పాటు మన మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది. శరీరంలో అవయవాలు కూడా చురుగ్గా పని చేసినప్పుడే మనం ఎక్కువకాలం జీవిస్తాము..కాబట్టి కష్టపడి పని చేయాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: