మంచిమాట: ఎవరి పని వారు చేస్తే అన్ని విధాలా బాగుంటుంది..!

Divya
సాధారణంగా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అలవాటు ఉన్నట్టుగానే పక్షులకు, జంతువులకు కూడా రకరకాల అలవాట్లు ఉంటాయి. ఇప్పుడు గద్ద చేస్తున్న పని కాకి చేయలేదు .. కాకి చేస్తున్న పని గద్ద చేయలేదు. అందుకే దేవుడు కొన్ని కొన్ని జాతులకు, కొన్ని కొన్ని పనులను అలవాట్లుగా మార్చి ఇచ్చిన విషయం తెలిసిందే.. ఇకపోతే సృష్టికి విరుద్ధంగా ఎవరైనా పనులు చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు ఒకసారి కథ రూపంలో మనం చదివి తెలుసుకుందాం..
మామూలుగా గ్రద్దలన్ని బాగా ఎత్తు నుండి కిందకు వచ్చి తమ ఆహారాన్ని తన్నుకొని పోతుంటాయి. అంతేకాకుండా బాగా ఎత్తులో నుండి కూడా అవి నేలమీదనున్న ఎలుక, ఉడుత మొదలైన జంతువుల్ని కోడి పిల్లల వంటి చిన్న చిన్న పక్షుల్ని కూడా సులువుగా గుర్తు పట్టి క్రిందకు వచ్చి వాటిని ఎగరేసుకొని పోతుంటాయి.
     
ఒక రోజున ఒక గ్రద్ద ఆకాశమార్గాన ఎగురుతూ.. నేల మీద ఉన్న ఉడుతని చూసి అమాంతం, గ్రద్ద వచ్చి ఉడుత ను తన్నుకునిపోయింది. పక్కనే ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుపై కూర్చున్న కాకి,  గ్రద్ద వేటాడే ఆ పద్ధతిని చూసింది. కాకికి ఒక అనుమానం వచ్చింది. "గ్రద్ద ..నేనూ..ఇద్దరూ  కూడా పక్షులమే! అది మాత్రం అంత ఎత్తులో నుండి వచ్చి క్రిందనున్నఆహారాన్ని తన్నుకొని పోతున్నప్పుడు, నేను మాత్రం ఈ విధంగా ఎందుకు చేయకూడదు?"అనే ఆలోచన కాకి వచ్చింది.

వెంటనే ఆ కాకి ఆకాశంలో చాలాఎత్తుగా పైకి ఎగిరింది. నేల మీద దానికోక చిన్న పక్షి కనిపించింది. అది వెంటనే ఒక్కసారిగా గ్రద్దలాగా దిగివచ్చి ఆహారాన్ని పట్టుకోవాలనుకుంది. క్రిందకు వచ్చే టప్పుడు వేగాన్ని తగ్గించుకోవాలని కాకి  తెలియదు. కాకి అతివేగంతోనూ క్రిందకు దూసుకువెళ్ళింది. అలాగే ముక్కుతో నేలను ఢీకొంది. కాకి ముక్కు కాస్తా ముక్కలైపోయింది. కాబట్టి ఎవరు చేసే పని వారికి మాత్రమే తెలుస్తుంది కాబట్టి వారు అత్యంత సులభంగా చేయగలుగుతారు. ఇతరులను ఒక వేళ అనుసరించాలి అంటే ,ఆ పనిలో ఉన్న అన్ని మెళకువలు తెలుసుకున్న తర్వాతనే అనుకరిస్తే అన్ని విధాలా మంచిది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: