మంచి మాట: తెలియకుండా నమ్మడం అంటే గొర్రె కన్నా హీనం..

Divya
ఇటీవల కాలంలో మనుషులు ఎలా ఉన్నారు అంటే, ఒకరు ఏ విషయంలోనైనా ఏదైనా మంచి సాధించారు అంటే , తప్పకుండా ప్రతి ఒక్కరూ అదే దారిలో నడవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.. ఉదాహరణకు ఎవరైనా ఒక రంగంలో మంచి ఆదాయాన్ని సంపాదించారు అంటే , తప్పకుండా మరికొంతమంది అదే వ్యాపారాన్ని మొదలు పెట్టాలని చూస్తూ ఉంటారు. కానీ అతడికి తెలిసిన అన్ని నియమాలు గుడ్డిగా అనుసరించే వారికి తెలియదు. ఫలితంగా వ్యాపారంలో బోల్తా పడడం జరుగుతుంది. ఇక ఇదే కాదు ఏ విషయంలోనైనా సరే ఎవరినీ కూడా మనం గుడ్డిగా అనుసరించరాదు. అలా అనుసరించడం వల్ల వాటి పరిణామాలు కూడా అంతే దారుణంగా ఉంటాయి. ఇక వీటికి సంబంధించిన ఒక చిన్న కథను ఉదాహరణగా ఇప్పుడు ఒకసారి మనం కూడా చదువుదాం..
ఒక రోజు ఒక సన్యాసి తన శిష్యులను వెంటబెట్టుకుని ఎటో బయల్దేరాడు. దారిలో శిష్యులకు చేపలతో నిండిన ఒక కొలను కనిపించింది. గురువు ఆగి చేప తో సహా ఆ నీళ్లను నోటి నిండా తీసుకున్నాడు. అలా కొన్ని దోసిళ్ళు తీసుకున్నాడు. శిష్యులు తమ గురువు చేసినట్టు చేశారు. కానీ గురువు ఏమీ అనకుండా ముందుకు వెళ్లిపోయాడు.
అలా వెళుతుండగా మరో చెరువును చేరుకున్నారు. అయితే అందులో చేపలు లేవు. అప్పుడు గురువుగారు చెరువు ఒడ్డున నిలబడి తాను మింగిన చేపల్ని ఒక్కొక్కటి బయటకి తీసి చెరువులో వేయడం మొదలు పెట్టాడు. శిష్యుడు ఇది చూశారు. వారు కూడా అలా చేయడానికి ప్రయత్నించారు. చాలా ప్రయత్నాల
తరువాత కేవలం చచ్చిపోయినా చేపల్ని బయటకి తీసుకు రాగలిగారు.
అప్పుడు గురువు ఇలా అన్నాడు..ఓరి బుద్ధిహీనుల్లారా కడుపులో చేపల్ని సజీవంగా ఉంచడం చేత కాలేదా..? అలాంటప్పుడు నన్ను ఎందుకు అనుసరించారు.అని ప్రశ్నించాడు..అప్పుడు గురువు శిష్యులతో  అందుకే అన్నారు.. దేనినీగుడ్డిగా అనుసరించరాదు అని.. ఇక ఇది తెలుసుకున్న శిష్యులు ఆ రోజు నుంచి ఆచితూచి ఆలోచించి ముందడుగు వేయడం నేర్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: