మంచి మాట:గొప్పలు చెప్పకు-కష్టాలను కొనితెచ్చుకోకు

Sravani Manne
ఒకరోజున రాముడు అనే వస్తాదు రాజుగారి దగ్గరకు వచ్చాడు.అతడు రాజుగారితో "రాజా!నేను చాలా బలవంతుడిని.నేను ఒకసారి ఒక పర్వతాన్ని కూడా పైకి ఎత్తాను.నేను రోజు వంద లీటర్ల పాలు తాగుతాను.నేను సింహాలతో కూడా పోట్లాడాను"అని చెప్పాడు.ఆ కండలు తిరిగిన వీరుని చూచి రాజుగారు చాలా మెచ్చుకున్నారు."ఇటువంటి వీరుడితో నా రాజ్యంలో ఉంటే ముందు ముందు చాలా ఉపయోగముంటుంది" అనుకోని రాజుగారు అతణ్ణి కొలువులో ఉద్యోగిగా నియమించారు.


నిజంగా రాముడికి ఏమి పని ఉండేది కాదు.మితిమీరిన తిండి మెక్కడం శుభ్రంగా గుర్రుపెట్టి నిద్రపోవటం ఇలాగ కొన్నాళ్ళు గడిచింది.అక్కడకు దగ్గరలో ఒక పెద్ద అడవి ఉంది.రాత్రి కాగానే తోడేళ్ళు,పెద్ద పులులు వంటి క్రూర జంతువులు ఆ రాజ్యంలోనికి ప్రవేశించి అనేక పశువుల్ని,మనుషుల్ని,కూడా చంపితిని వేయసాగాయి.ప్రజలు వచ్చి రాజుగారితో తమ కష్టాల్ని తొలగించవలసినదిగా మొర పెట్టుకున్నారు.రాజుగారికి రాముడు,అతని సాహసాలు గుర్తుకు వచ్చాయి.నీవు ఇది వరకు ఒక పర్వతాన్ని ఎత్తి పక్కన పడవేసినట్లు చెప్పావు.అది నాకు గుర్తు ఉంది. ఇప్పుడు నువ్వు మన రాజ్యంలో అడవికి అనుకోని ఉన్న పర్వతం ఉంది.దాన్ని ఎక్కడైనా ఎత్తి పడవేయ్యాలి. అని చెప్పారు.


అందుకు అంగీకరించిన రాముడు  ఆ రోజున మామూలు కంటే ఎక్కువ తిండితిని బోలెడన్ని పాలు త్రాగాడు.రాజుగారు మిగతా ఉద్యోగులు తన వెంట రాగా రాముడు  ఆ పర్వతం వద్దకు చేరుకుంటాడు.వెంటనే అతడు రాజుతో మహారాజ మీ మనుష్యుల చేత పర్వతాన్ని త్రవించoడి.అప్పుడు దానిని పైకి ఎత్తి అవలీలగా పడేస్తాను అంటాడు రాముడు.రాజుకి పిచ్చి ఎక్కిన పని అయిoది. పర్వతాన్ని త్రవించoడo ఏంటి?పూర్వం నువ్వే కదా పర్వతాన్ని ఎత్తి పడేశాను అని చెప్పావు కదా? అని అడిగారు రాజుగారు.అవును పర్వతాన్ని ఎత్తినట్లు చెప్పాను కాని నేను  త్రవ్వి పైకి ఎత్తినట్లు చెప్పలేదు అన్నాడు రాముడు.


రాజుగారికి అంతులేని కోపం వచ్చింది."వీడి మాటలు నమ్మి,ఇంతకాలం అనవసరంగా వీడిని మేపాం.ఈ మోసగాణ్ణి తరిమేయండి.ఇటువంటి కోతల రాయుళ్ళు మనకొద్దు" అన్నారు రాజుగారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: