మంచిమాట : చదువు పాఠం చెప్పి పరీక్ష పెడుతుంది.. కానీ జీవితం పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది..!

Divya

ప్రస్తుత కాలంలో  మనం జీవిస్తున్న ఆధునిక ప్రపంచంలో, ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న సరికొత్త టెక్నాలజీని మనం చూస్తూనే ఉన్నాము..అలాగే ఎక్కడో ఒకచోట, ఎవరో ఒకరి నోట  వింటూనే ఉంటాము.. అయితే ఇవన్నీ మనము కూడా తెలుసుకోవాలంటే  అన్ని రంగాలపైనా మనకు అవగాహన ఉండాలి. అప్పుడే ప్రపంచం నలుమూలల ఏం జరుగుతుందో అనే విషయం కూడా మనము తెలుసుకోగలుగుతాం. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీకు ఒకే వేదిక తారసపడుతుంది. ఆ వేదిక ఏమిటంటే "ఇండియా హెరాల్డ్" . ఇండియా హెరాల్డ్ ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలను మీకు చూపిస్తూ, మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించాలనే నెపంతో, ఎప్పటికప్పుడు మంచి మాటలను మీ ముందుకు తీసుకు వస్తుంది.. అందులో భాగంగానే ఈరోజు మంచి మాట ఏమిటంటే..చదువు పాఠం చెప్పి పరీక్ష పెడుతుంది.. కానీ జీవితం పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది..!
దీని అర్థం ఏమిటంటే సాధారణంగా చదువు అనేది మనం చదువుకునేటప్పుడు, పాఠం విన్న తర్వాత మాత్రమే పరీక్ష పెట్టడం జరుగుతుంది. కానీ జీవితం అలా కాదు, జీవితం పరీక్ష పెట్టిన తర్వాతనే మనకు ఒక గుణపాఠం నేర్పుతుంది. అంటే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాతనే మనకు జీవితం ఏంటో తెలిసి వస్తుంది. అప్పుడే అందరితో ఎలా ఉండాలి అనే విషయాన్ని కూడా తెలుసుకోగలుగుతాం. ఇక ఎవరు ఎలాంటి వారో తెలుసుకున్నప్పుడే మనం జాగ్రత్తగా ఉండగలుగుతాము అని దీని అర్థం..
ఇక జీవితంలో ఎప్పుడూ ఏదీ కష్టపడకుండా సులభంగా మన దగ్గరకు రాదు. ఏదైనా కావాలి అంటే కష్టపడక తప్పదు. ఏదైనా కావాలని కోరుకున్నప్పుడు మార్గం మధ్యలో ఎన్నో కష్టాలను, నష్టాలను ఓర్చుకుని ముందుకు వెళ్లాలి.  అంతేకాకుండా అలా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వెళ్ళినప్పుడే జీవితం మనకు అన్ని పాఠాలను నేర్పిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క విషయంలోనూ జాగ్రత్త వహించడం అవసరం.కాబట్టి జీవితం అన్ని ఒడిదొడుకులను అన్ని కష్టాలను నేర్పిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: