మంచిమాట : మనిషి ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు.. ఉంటే పనికిరాని ఆలోచనలు వచ్చి, అజ్ఞాని గా మారిపోతారు..!

Divya

ప్రస్తుత కాలంలో  మనం జీవిస్తున్న ఆధునిక ప్రపంచంలో, ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న సరికొత్త టెక్నాలజీని మనం చూస్తూనే ఉన్నాము..అలాగే ఎక్కడో ఒకచోట, ఎవరో ఒకరి నోట  వింటూనే ఉంటాము.. అయితే ఇవన్నీ మనము కూడా తెలుసుకోవాలంటే  అన్ని రంగాలపైనా మనకు అవగాహన ఉండాలి. అప్పుడే ప్రపంచం నలుమూలల ఏం జరుగుతుందో అనే విషయం కూడా మనము తెలుసుకోగలుగుతాం. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీకు ఒకే వేదిక తారసపడుతుంది. ఆ వేదిక ఏమిటంటే "ఇండియా హెరాల్డ్" . ఇండియా హెరాల్డ్ ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలను మీకు చూపిస్తూ మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించాలనే నెపంతో ఎప్పటికప్పుడు మంచి మాటలను మీ ముందుకు తీసుకొస్తుంది.. అందులో భాగంగానే ఈరోజు మంచి మాట ఏమిటంటే..మనిషి ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు.. ఉంటే పనికిరాని ఆలోచనలు వచ్చి, అజ్ఞాని గా మారిపోతారు..!

దీని అర్థం ఏమిటంటే.. మనిషి ఎప్పటికప్పుడు బిజీగా మారి పోవాలి. ఎప్పుడూ ఖాళీగా కూర్చొని సమయం వృధా చేయకూడదు. ఒకవేళ అలా ఖాళీగా ఉంటే పనికిమాలిన ఆలోచనలు వచ్చి, అజ్ఞానిగా మారిపోతాడు. అంతేకాకుండా విచక్షణ రహితంగా ప్రవర్తించే పరిస్థితి చేరుకుంటాడు.. కాబట్టి ఎప్పటికప్పుడు మనిషి నలుగురితో మాట్లాడుతూ.. అందరిని కలగలుపుకు పోతూ ఉండాలి. అప్పుడే మనిషి యొక్క విలువ పెరుగుతుంది. జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు.. ప్రతి ఒక్క మనిషి ఒక మంచి పుస్తకం లాంటివాడు. ఒక మంచి పుస్తకం మనకు ఏదైతే నేర్పిస్తుందో,  ఒక మనిషి కూడా మనకు సరికొత్త విజ్ఞానాన్ని నేర్పిస్తాడు..

మనిషిలో ఎలాంటి స్వభావం ఉన్న ప్రతి ఒక్కరి తో మాట్లాడుతూ, వారి హావభావాలను ఇతరులకు వ్యక్తపరచాలి. అప్పుడే మనుషులు ఎలాంటి వారు, మనం ఎలాంటి సమాజంలో బ్రతుకుతున్నాము అనే ఒక ఈ విషయాన్ని తెలుసుకోగలుగుతాం. ఎప్పుడైతే మనుషుల్లో కలిపి తిరుగుతారో అప్పుడు జ్ఞానం కూడా పెరుగుతుంది. ఒంటరిగా కూర్చుంటే మనలో మనమే చించుకుంటూ ఉండాలే తప్పా ఎలాంటి జ్ఞానాన్ని సంపాదించుకోలేరు పైగా అజ్ఞానిగా మిగిలిపోతారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: