మంచిమాట: తెలివి తక్కువ ఆలోచన నష్టాలకు దారితీస్తుంది..!!

Divya
అనగనగా ఒక ఎలుక.. ఒక కప్ప ఎంతో స్నేహంగా ఉండేవి. ప్రతి ఉదయం కప్ప చెరువులోంచి బయటకు వచ్చి..దగ్గర్లోని ఒక చెట్టు కింది కలువు లో నివాసం ఉండే.. ఎలుక దగ్గరకు వెళ్లి మధ్యాహ్నం వరకు సరదాగా గడిపి తిరిగి వచ్చేది. ఎలుక కూడా తన స్నేహితునితో ఎంతో సరదాగా ఉండేది. అతని కోసం ఎదురు చూసేది.. కానీ వారి మధ్య కూడా గొడవలు వస్తాయని ఊహించలేదు. శత్రువులుగా మారతామని అస్సలు అనుకోలేదు.. దీనికి కారణం ఒక్కటే.. ప్రతిరోజు నేనే వెళ్తున్నాను కానీ నా దగ్గరకు ఎలుక రావటం లేదు. అని కప్ప భావించడమే..
ఒకరోజు మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చే సమయంలో ఎలుకకు బుద్ధి చెప్పాలనుకుంది. దాని తో మాట్లాడి తిరిగి వచ్చే ముందు తన కాలికి ఎలుక తోకకు కలిపి తాడు కట్టింది. తర్వాత  గెంతుతూ తను ఉన్న చెరువు వైపు వెళ్ళింది. ఈ లోగా ఎలుక కప్ప నీటి దగ్గరికి వెళ్ళే లోగా అది తన తోకకు కట్టిన తాడును కొరికి తెంచబోయింది. కానీ దానివల్ల కాలేదు. దాంతో తప్పనిసరై కప్ప వెనగ్గా వెళ్లాల్సి వచ్చింది. నీళ్ళల్లోకి కప్ప దిగగానే వెంటనే ఎలుక ఎగిరి దాని వీపు మీద కూర్చుంది. నీళ్లలో అలా కొద్ది దూరం వెళ్ళగానే ఎలుక బరువును మోయలేక పోయింది.
వీరి తంతు చూస్తున్న ఒక గ్రద్ద పై నుంచి రివ్వున వచ్చింది. ఎలుకను తన బలమైన కాళ్లతో పట్టి చెట్టు మీదకి తీసుకెళ్ళింది. దాని తోకకు తన కాలికి కట్టుకున్న కప్ప కూడా ఎంత ప్రయత్నించినా కట్టు తెంపుకోలేకపోయింది. అది కూడా ఎలుక తో పాటు చెట్టు మీదకు చేరింది. అనాలోచిత చర్య కు అవి రెండు గ్రద్దకు ఆహారం అయ్యాయి. కాబట్టి ఏదైనా ఒక పని చేసేటప్పుడు ప్రతి క్షణం ఆలోచించి సరైన మార్గంలో నిర్ణయం తీసుకోవడం వల్ల సత్ఫలితాలు ఉంటాయి.. లేకపోతే ఇలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: