చంద్రబాబుగారి తెలివి ముందు ఎవరైనా తేలిపోవాల్సిందే!

praveen

ఏపీ సీఎం చంద్రబాబు గురించి జనాలకి చెప్పాల్సిన పనిలేదు. 74 ఏళ్ల వయస్సుగల ఈ రాజకీయ ఉద్ధండుడి గురించి జనాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన రాజకీయ చరిత్రలో ఎన్నో సవాళ్ళను చూశారు, శిఖరాలను కూడా చూశారు. సరిగ్గా 6 నెలల క్రితం టీడీపీ కూటమిలో విజయ దుందుభి మోగడం వెనకాల చంద్రబాబు పాత్ర ఎంతైనా ఉంది. ఇక గత వైస్సార్సీపీ పాలన గురించి జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అభివృద్ధి మాట ఎలా ఉన్నా, సంక్షేమ పధకాలు పంచడంలో జగన్ నూటికి నూరు పాళ్ళు విజయం సాధించారని చెప్పుకోవచ్చు. ఇదే విషయాన్ని ఒక్కొక్కరు ఒకోలా మాట్లాడుతూ ఉంటారు. కొందరు జగన్ సంక్షేమ పధకాలను ఇవ్వడం తప్ప, రాష్ట్రానికి చేసింది ఏదీ లేదు అని కొందరంటే... జగన్ పాలనను కొనియాడే వారు కూడా లేకపోలేదు.
అయితే రాజకీయం చేయడంలో కాకలు తిరిగిన యోధుడు అని చెప్పాల్సిన పనిలేదు. ఈ విషయంలో ఆయనికి ఎవరూ సాటి కారు. ప్రస్తుతం ఏపీకి సీఎంగా ఉన్న బాబు, గత వైసీపీ అరాచక పాలనను గుర్తు చేస్తూనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి ఎలా కుంటుపడిందనే విషయాన్ని జనాల్లోకి జోరుగా తీసుకెళ్లే పనిలో పడ్డారు. దీనిని వైస్సార్సీపీ సానుభూతి పరులు కొందరు "అభివృద్ధి జరిగితే తన వలన, చేయకపోతే జగన్ కారణం" అనే నినాదాన్ని బాబు బలంగా జనంలోకి తీసుకెళ్తున్నట్టు కనబడుతోంది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇక సీఎం చంద్రబాబు తాజాగా విజయవాడలో నిర్వహించిన స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసినదే. విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన అనంతరం బాబు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టడానికి సమావేశమయ్యాం! అంటూ సాగిన బాబు ప్రసంగం ఆద్యంతం చాలా అద్భుతంగా సాగింది. రాష్ట్ర దశ దిశను మార్చే స్వర్ణాంధ్ర విజన్-2047ను ఇవాళ ఆవిష్కరించామని ఈ సందర్భంగా వెల్లడించారు. "ప్రపంచంలోనే తెలుగుజాతిని నెంబర్ వన్ గా చేసేందుకు ఇవాళ ఇక్కడ బీజం పడింది.. ప్రజల తలరాతలను, భావితరాల భవిష్యత్ ను మార్చేదే ఈ స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్." అని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు. పెద్దఎత్తున నిర్వహించే ఈ కార్యక్రమానికి కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల నుంచి దాదాపు 25 వేల మంది హాజరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: