ఇక రాజకీయాలకు బ్రేక్‌ ...కేటీఆర్‌ సంచలన ట్వీట్‌ ?

Veldandi Saikiran
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజకీయాలకు బ్రేక్ ఇచ్చారు. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ లో వేదికగా షేర్ చేసుకున్నాడు. మాజీ మంత్రి కేటీఆర్ కొన్ని రోజులు రెస్ట్ మోడ్ లోకి వెళ్ళనున్నారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. నేను రీఫ్రెష్ కావాలి అనుకుంటున్నానని వెల్లడించారు. అందుకే కొన్ని రోజులు పాటు అన్నిరకాల కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాను అంటూ కేటీఆర్ అనౌన్స్ చేశాడు.

నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను ఎప్పటికీ మర్చిపోరని ఆశిస్తున్నానంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ చూసిన నెటిజెన్స్ పలు రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, నిన్న తెలంగాణ భవన్ లో కేటీఆర్ సంచలన వాక్యాలు చేశారు. సోనియా గాంధీ బిక్ష వల్లే తెలంగాణ వచ్చిందని రాష్ట్ర ఆత్మగౌరవాన్ని తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాన్ని సీఎం రేవంత్ రెడ్డి కించపరుస్తున్నాడని ఆగ్రహించారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

ఉద్యమం పై గన్ను ఎక్కుపెట్టిన సీఎం  రేవంత్  రెడ్డి... కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తా అని రెచ్చిపోతున్నాడని ఆగ్రహించారు.  సోనియమ్మ లేకపోతే.. తెలంగాణ అడుక్కుతినేదని అహంకారంతో వాగుతున్నడు కాంగ్రెస్ సీఎం రేవంత్‌ రెడ్డి అంటూ మండిపడ్డారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.  తెలంగాణ అస్తిత్వంపై గుజరాత్ గులాములు ఓ పక్క…ఢిల్లీ కీలుబొమ్మలు మరో పక్క దాడి చేస్తున్నారని ఓ రేంజ్‌ లో రెచ్చిపోయారు.

ప్రస్తుత పార్లమెంట్ లో మన గళం వినిపించే నాథుడే లేడన్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ గొంతు బీఆర్ఎస్ మాత్రమే. ఇంకెవరూ కాదని తెలిపారు. లగచర్ల భూముల సేకరణ విరమణ బీఆర్ఎస్ విజయం, తెలంగాణ ప్రజల విజయం అని తెలిపారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సమైక్యాంధ్ర సంచులు మోసిన తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రిగా ఉన్నాడని రేవంత్ పై నిప్పులు చెరిగారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: