జగన్: సోనియా గాంధీ చేతకానిది.. చంద్రబాబు చేసి చూపిస్తున్నారా..?

Divya
ఆంధ్రప్రదేశ్ వైసీపీ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జీవితంలో అనూహ్య సంఘటనలు.. చాలానే జరిగాయి.. అలాంటి వాటిలో  అప్పటివరకు ప్రశాంతంగా సాగుతున్న జీవితంలోకి అకస్మాత్తుగా కేసులు రావడం.. ఆ కేసుల తర్వాత అరెస్టు కావడం.. అది అనుహ్యం. అయితే అప్పుడు మానసిక క్షోభ కంటే కూడా కసి తెగింపు ఉండేది.. కానీ భయం పుట్టించడం అనేటటువంటి కాన్సెప్ట్  ప్రత్యర్థులు ఎలా చేస్తారు అనడానికి.. చుట్టూ ఉన్నటువంటి మనుషులు అకస్మాత్తుగా వెళ్ళిపోతూ ఉండేటువంటి కాన్సెప్ట్ మొదటిసారి చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి.

గతంలో అయితే జగన్ కోసం చాలామంది నేతలు సీనియర్ నేతలు కూడా పాదయాత్రలో భాగంగా అరెస్టులు జైల్లు వంటి సందర్భాలలో మంత్రులుగా ఉన్నవారు కూడా మద్దతు ఇచ్చారు, ఎమ్మెల్యేలుగా ఉన్నవారు కూడా మద్దతు ఇచ్చారు.. చాలా పెద్ద ఎత్తున మద్దతు అయితే కూడబెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అలాంటి స్థాయి వ్యక్తి.. గతంలో 151 యొక్క మంది ఎమ్మెల్యేలు కలిగే ఉండి.. సుమారు 40 మంది ఇందులో మంత్రి పదవిని కూడా పొంది అనుభవించిన వారు కూడా కనిపించడం లేదు.

అందులో కనీసం 10 శాతం మంది కూడా కనిపించడం లేదట... భయం అనేటువంటిది సోనియా గాంధీ వల్లే పుట్టించాలని  చూసిన ఆవ్వలేదు కానీ.. చంద్రబాబు నాయుడు పుట్టించగలిగారనే  వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. జగన్ చుట్టూ ఉన్న శక్తులకు ఒక వణుకు పుట్టిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. జగన్ ని నమ్ముకున్న అధికారులు నేతలు సపోర్టుగా ఉన్నవారు జగన్ ని నమ్ముకుంటే.. భవిష్యత్తులో భయపడే స్థాయికి ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు చంద్రబాబు. అందులో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాజకీయ నాయకుల ఎవరి మీద పడితే వారందరి మీద కూడా కేసులు ఉన్నాయి.. ఏదో ఒక రకమైనటువంటి కేసులు కూడా ఉన్నాయట.. ఇలాంటి భయాలతోనే చాలామంది జగన్ దగ్గరికి వెళ్లాలంటే భయపడుతున్నారట. మరి వీటన్నిటిని రాబోయే రోజుల్లో జగన్ అధికమించగలరా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నాక మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: