జగన్ హోం మంత్రికి స్థాన చలనం తప్పదా... !
అయితే 2024 ఎన్నికలలో జగన్ ఆమెకు స్థానాచలనం చేశారు. కొవ్వూరు కాదని ఆమె సొంత నియోజకవర్గం గోపాలపురం నుంచి పోటీచేసి టిడిపి యువ నాయకుడు మద్దిపాటి వెంకటరాజు చేతిలో ఓడిపోయారు. అలాగే గత ఎన్నికలకు ముందు వరకు గోపాలపురం ఎమ్మెల్యేగా ఉన్న తలారి వెంకట్రావును కొవ్వూరుకు మార్చగా.. ఆయన కూడా అక్కడ ఓడిపోయారు. ఎన్నికలలో ఓటమి అనంతరం జగన్ తిరిగి మార్పులు చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తలారి వెంకట్రావు, తానేటి వనిత స్థానాలను జగన్ పరస్పరం మారుస్తారా.. అనే చర్చలు పార్టీ వర్గాల్లో నడుస్తున్నాయి.
తలారి వెంకట్రావు, తానేటి వనిత ఇద్దరిదీ గోపాలపురం నియోజకవర్గం కావటం విశేషం. తానేటి వనిత మనసులో ఏముంది.. ఆమె కొవ్వూరు కి వెళ్ళిపోతారా.. లేదా గోపాలపురం ఇన్చార్జిగా ఉండేందుకు ఇష్టపడతారా.. అన్నది బయటపడనిపరిస్థితి. వస్తావంగా వనిత మనసులో గోపాలపురంలో కొనసాగేందుకే ఇష్టంగా ఉన్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. వనిత గోపాలపురంలోనే రాజకీయం చేయాలి అనుకుంటే తలారి వెంకట్రావు ఇక కొవ్వూరులోనే ఉండాల్సి ఉంటుంది. ఇప్పటి నియోజకవర్గాలలో జగన్ ఇన్చార్జిలను ఇష్టం వచ్చినట్టు మార్పులు చేర్పులు చేస్తున్నారు. మరి ఈ లెక్కన తానేటి వనితకు స్థానాచలనం తప్పదా.. లేదా ఆమెకు మార్పు ఉండదా అన్నది చూడాలి.